అప్పుడు వాళ్ళు, మేము ఈరోజు మీ అత్తగారితో తేల్చుకోవాలి, మా కూతురు పరువు ఏమవ్వాలి,మా ఇంటి పరువు ఏమి అవ్వాలి, అసలు ఇంత పెద్ద నిర్లక్ష్యం ఎలా చేయగలరు అని అడగగా, నాకు కొంచెం సమయం ఇవ్వండి నేను ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఎలాగైనా ఒప్పించడానికి ప్రయత్నిస్తాను,మీ కూతురు జీవితం నాశనం అవ్వకుండా ఉండాలంటే ఇదొకటే మార్గం ఉన్నది అని వాళ్ళని తిరిగి పంపించేస్తుంది.అంతలో అఖిల్ ఇంట్లోకి వస్తాడు. జానకి అప్పుడు అఖిల్ దగ్గరికి వెళ్లి అఖిల్ ని నిలదీస్తుంది.