మరొకవైపు మల్లిక(mallika) కూడా గ్లామర్ గా రెడీ తన అందం చూసి తానే పొగుడుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో విష్ణు అక్కడికి వచ్చి చీర బాగా లేదు మార్చుకోమని అంటాడు. కానీ మల్లిక వినిపించుకోకుండా అలాగే బయటికి వెళ్తుంది. అప్పుడు జ్ఞానాంబ(jnanamba)మల్లికను తిట్టి చీర మార్చుకునేలా చేస్తుంది. ఇక ఆ తర్వాత జానకి,జ్ఞానాంబ, మల్లికా ముగ్గురు ఫంక్షన్ కి వెళ్లగా అక్కడ ఒక ఆమె జానకి ఇంకా విశేషం ఏమీ లేదా అని అనటంతో జానకి మౌనంగా ఉంటుంది.