Published : Jun 27, 2022, 12:42 PM ISTUpdated : Jun 27, 2022, 12:45 PM IST
‘నాగిని’ ఫేమ్ మౌనీ రాయ్ (Mouni Roy) హాట్ గ్లామర్ షోతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పెళ్లి అయినా హద్దులను చెరిపేస్తూ అందాల విందు చేస్తోంది. లేటెస్ట్ గా ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి.
‘నాగిని’ సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్. సినిమాల్లోకి రాకముందు టెలివిజన్ షోస్, సిరీయల్స్ లో నటించింది. పలు విభిన్న రోల్స్ తో అద్భుతమైన నటనతో టీవీ ప్రేక్షకులకు దగ్గరైందీ బ్యూటీ. తన అందానికి అభినయం తోడవటంతో అమ్మడు క్రేజ్ అమాంత పెరిగింది.
26
దీంతో మెళ్లగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మౌనీ రాయ్ అందాలను బిగ్ స్క్రీన్ పైనా ఆరబోసింది. పంజాబీ, హిందీ చిత్రాల్లో స్పెషల్ అపియరెన్స్ తో అదరగొట్టింది. ఇటీవల వచ్చిన ‘కేజీఎఫ్1’ (KGF1)లోనూ ఈ బ్యూటీ ఐటెం సాంగ్ లో ఆడిపాడింది.
36
ప్రస్తుతం రన్బీర్ కపూర్ మరియు అలియా భట్ జంటగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మస్ర్త’లోనూ ఓ స్పెషల్ రోల్ లో నటిస్తోంది. దీంతో సౌత్ ఆడియెన్స్ కు మరింత దగ్గర కానుంది. ఈ చిత్రంలో తెలుగులో ‘బ్రహ్మస్త్రం’గా రిలీజ్ కానుంది. ఇప్పటికే జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న యూనిట్ అక్టోబర్ లో మూవీని రిలీజ్ చేయనుంది.
46
ఇదిలా ఉంటే... మౌనీ రాయ్ అటు సినిమాలు, ఇటు సీరియల్స్, టెలివిజన్ షోస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ లేటెస్ట్ ఫొటోషూట్లతో రచ్చరచ్చ చేస్తోంది. అందాల విందుతో నెటిజన్లను చూపుతిప్పుకోనివ్వడం లేదు.
56
ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ బ్యూటీ లేటెస్ట్ గా స్టన్నింగ్ ఫొటోస్ ను తన అభిమానులతో పంచుకుంది. ఈ పిక్స్ లో బిగుతైన దుస్తులు ధరించిన మౌనీ టెంప్టింగ్ ఫోజులతో కుర్రాళ్ల మతిచెడగొడుతోంది. రెడ్ మినీ టాప్, బ్లూ జీన్స్ లో నడుము అందాలను చూపిస్తూ రచ్చరచ్చ చేస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ లో నెట్టింట వైరల్ అవుతున్నాయి.
66
ఈ ఏడాది మౌనీ రాయ్ వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా అతనితో ప్రేమలో ముగిని తేలిన మౌనీ జనవరి 27న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. గోవాలో మలయాళి, బెంగాలి సంప్రదాయ పద్దతుల్లో వివాహాం జరిగింది.