ఇప్పుడు పెంట పెట్టింది అని అనుకొని అబ్బాయే వదిన అంటాడు. అప్పుడు జ్ఞానాంబా నా కొడుకుకు ఫ్రెండ్స్ తప్ప అలాంటి ప్రేమ వ్యవహారాలు ఏవి తెలీదు. నువ్వు చదువుకునే వ్యక్తితో అలాంటి మాటలు చెప్పి వాడి మనసుని పాడు చేయొద్దు అని మల్లిక ని తిడుతుంది జ్ఞానాంబ. అప్పుడు మల్లిక కూతురు లాగా కొడుకు కూడా ఏదో ఒక పెంట పెట్టకపోడా అప్పుడు చెప్తాను అని అనుకుంటుంది. అప్పుడు జ్ఞానాంబా, ఏదైనా ముందు గుడికెళ్లి అట్నుంచి వచ్చాక నీ పని చూసుకో అని అంటుంది. అందరూ బయలుదేరుతున్నప్పుడు అఖిల్, గుడికి వెళుతున్నాము అమ్మ తిడుతుంది.