ఆ తర్వాత సీన్లో గౌతం, జగతి,మహేంద్ర రెస్టారెంట్లో కూర్చొని ఈ శుభ సందర్భాన్ని కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకుంటారు.కేక్ కట్ చేసి అందరికీ పంచుదామని అనుకుంటారు ఇంతకీ స్పెషల్ ఏంటి అని అడిగితే ఏమని చెప్తావు అని జగతి అనగా ఒక మంచి పని జరిగింది అని చెబుదాము అని అంటాడు. అదే సమయంలో రిషి వసుతో పాటు అక్కడికి వస్తాడు. ఆశ్చర్యంతో గౌతమ్, మహీంద్రా, జగతిలు లేచి వీళ్లిద్దరూ ఎప్పుడు కలిశారు అని మనసులో అనుకుంటూ ఉంటారు. అప్పుడు జగతి, మనం ఆ విషయంతో పాటు ఈ విషయానికి కూడా సెలబ్రేట్ చేసుకోవాలి ఏమో అని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!