Ennenno Janmala Bandham: పెళ్లి జరగదు అన్నా వేద నిర్ణయాన్ని మార్చేదేవరు..

Navya G   | Asianet News
Published : Mar 02, 2022, 03:02 PM IST

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్ ఎన్నెన్నో జన్మల బంధం. ప్రారంభమైన కొంత కాలానికే ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకుల మధి దోచింది. ప్రస్తుతం ఈ సీరియల్ లో పెళ్లి గురించి ఉత్కంఠంగా కొనసాగుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..  

PREV
19
Ennenno Janmala Bandham: పెళ్లి జరగదు అన్నా వేద నిర్ణయాన్ని మార్చేదేవరు..

మాలిని నిజాన్ని దాచే పెట్టినందుకు వేదకు, వేద కుటుంబానికి క్షమాపణలు చెబుతూ ఉంటుంది. నా తల్లి ప్రేమ వల్లే నిజాన్ని దాచాను ఈ నిజం తెలిస్తే నువ్వు పెళ్లికి ఒప్పుకోవు ఏమో అని భయపడి చెప్పలేదు అంటుంది. సులోచన నాది కూడా తల్లి ప్రేమే కదా ఇంత పెద్ద నిజాన్ని మా దగ్గర దాచిపెట్టి నా కూతురు ని మోసం చేస్తారా అని అడుగుతూ ఉంటుంది.
 

29

ఇక వేద సులోచనను అపి ఈ పెళ్లి జరగదు అని చెప్తుంది రత్నం మాట్లాడుతూ ఖుషి వేద మీద పెంచుకున్న ప్రేమ గురించి చెబుతూ నా మనవరాలికి తల్లిగా నువ్వు మాత్రమే ఉండగలవు అంటాడు. ఒక్క క్షణం ఒక అమ్మ లాగా ఆలోచించు అని బతిమిలాడతాడు కానీ వేద ఆలోచించడానికి ఏమీ లేదు ఈ పెళ్లి చేసుకోను అని చెప్పడంతో రెండు కుటుంబాల వారు బాధపడుతూ ఉంటారు.
 

39

వేద అక్కడి నుంచి వెళ్ళి పోతూ ఉంటుంది వెళ్ళిపోతున్న వేదను యశోదర్ చూస్తూ ఉంటాడు. మాళవిక ఇంటికి వచ్చి పెళ్లి ఆపేసాను అని సంతోషంతో అభిమన్యుకి చెబుతుంది. ఇదంతా ఖుషి చూస్తూ పెళ్లి ఆగిపోయిందా, మా అమ్మనాన్న పెళ్ళి చేసుకోవటం లేదా అని ఏడుస్తూ ఉంటుంది. అభిమన్యు యశోదర్ పెళ్లి ఆగిపోయినందుకు నేను నిన్ను ఓడించాను ఇక నువ్వు తాగుతూనే ఉంటావు అని సంతోష పడుతూ ఉంటాడు.
 

49

మాళవిక నువ్వు చెప్పినట్టే పెళ్లి ఆపేశాను, అన్ని నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను  కాదా ఇక మనం పెళ్లి చేసుకుందామా అని అడిగితే అభిమన్యు ఖుషి కస్టడీ కేసు ఇంకా కోర్టులోనే ఉంది అది కూడా జరగనివ్వు ఆ తరువాత నువ్వు ఎలా చెబితే అలానే నాది పూచి అంటాడు. ఇక మాళవిక మాత్రం మనసులో పెళ్లి గురించి ఎప్పుడు అడిగినా మాట మార్చి పెళ్లిని వాయిదా వేస్తావు అయినా తప్పదు నాకు వేరే గత్యంతరం లేదు అనుకుంటుంది.
 

59

అభిమన్యు నా మీద నమ్మకం లేదా అంటాడు. లేదు డార్లింగ్ నీ మీద నాకు నమ్మకం ఉంది నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తుంది. అభిమన్యు యశోదర్ పెళ్లి ఆపినందుకు సంతోషించి ఇక ఖుషి కస్టడీ కేసు గెలవగానే ఖుషి ని యశోదర్ కు కనిపించకుండా దూరంగా హాస్టల్లో వేస్తాను అంటాడు. ఖుషి ని దూరం చేసి యశోధర్,వేద కు షాక్ ఇస్తానుఅంటాడు.
 

69

మాళవిక ఇప్పుడు మనం పార్టీ చేసుకోవాలి అంటూ ఇద్దరూ వెళ్ళిపోతారు. ఇదంతా చూస్తున్న ఖుషి ఏడుస్తూ ఉంటుంది. యశోదర్ వేద దగ్గరకు వచ్చి జరిగినదానికి క్షమాపణ అడుగుతూ నాకు ఒక కొడుకు ఉన్న నిజాన్ని కావాలి అని దాచిపెట్ట లేదు నన్ను తప్పుగా అపార్థం చేసుకోవద్దు అంటాడు. ఆ మాళవిక చెప్పిన మాటలు నమ్మి తప్పు చేస్తున్నావు ఈ పెళ్లిని ఖుషి కస్టడీ కోసం కాదు కేవలం ఖుషి సంతోషం కోసం, ఖుషి కి తల్లి ప్రేమను అందించడం కోసమే అంటాడు.
 

79

కానీ వేద జరగాల్సిన నష్టం జరిగిపోయింది, పెళ్లి ఆగిపోయింది ఇప్పుడిక అంతా ముగిసిపోయింది అంటుంది. ఇక ఖుషి ఏడుస్తూ ఆయమ్మను వేద దగ్గరకు తీసుకు వెళ్లాలని బతిమలాడుతూ ఉంటుంది. ఇక ఆయమ్మ చేసేది ఏమీ లేక ఖుషిని వేద దగ్గరకు తీసుకొస్తూ ఉంటుంది. వేద యశోదర్ కు ఇక మనం ఎప్పటికీ కలవము గుడ్ బాయ్(good bye) అని చెప్పి వెళుతుంది. ఖుషి పరిగెడుతూ వేద దగ్గరికి వస్తూ ఉంటుంది. వేద జరిగినదానికి బాధపడుతూ ఉంటుంది.
 

89

ఖుషి వేద దగ్గరకు వచ్చి ఫ్రెండ్ అని పిలుస్తుంది. వేద ఖుషి ని అలానే చూస్తూ ఉంటుంది నువ్వు ఇప్పుడు మా అమ్మ వి కాదుగా అందుకే ఫ్రెండ్ అని పిలిచాను అంటుంది వేద ఏడుస్తూ ఖుషిని హత్తుకుంటుంది ఖుషి అభిమన్యు మాళవిక మాట్లాడుకున్న మాటలను వేద కు చెప్తుంది. మా డాడీ చాలా మంచివాడు, మమ్మీ మంచిది కాదు నువ్వు మా అమ్మ గా ఉండొచ్చు కదా నువ్వు డాడీ నేను కలిసే ఉందాము నేను నీ దగ్గరే ఉంటాను అంటూ ఏడుస్తూ చెప్తుంది.
 

99

ఇక అభిమన్యు ఖుషి ని దూరం చేసి హాస్టల్ కు పంపిస్తాను అన్న విషయం గురించి కూడా చెప్పి నేను నీకు కనిపించను ఫ్రెండ్ అని బై చెప్పి వెళుతుంది. ఇక వేద కూడా ఖుషికి తనకు మధ్య జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక మనసు మార్చుకుని వేద ఖుషి దగ్గరికి వెళ్లి ఖుషిని ఎత్తుకొని తిప్పుతూ సంతోషంగా ఉంటుంది. యశోధర్,వేద పెళ్లి చేసుకుంటున్నట్టు చూపిస్తారు. మరి రానున్న ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకోవాల్సిందే.

click me!

Recommended Stories