ఈరోజు ఎపిసోడ్ లో మీరా, శరత్ తో ఫోన్ మాట్లాడుతూ దాని రెక్కల కష్టంతో ఎదగాలని చూస్తోంది దాని రెక్కలను తుంచేసి మీ ప్రేమ దానికి అక్కర్లేదు. ఇలా ఏదో ఒక కారణంతో పదేపదే ఫోన్ చేయొద్దండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది మీరా. అప్పుడు ఫోన్ కట్ చేసి నన్ను క్షమించండి బాబు గారు ఇలా మాట్లాడితేనే మీరు మల్లీకి దూరంగా ఉంటారు అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. మరొకవైపు మల్లీ దేవుడిని మొక్కుకుంటూ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మ తర్వాత నేను ఎక్కువగా తలుచుకుంది మిమ్మల్ని. మీరు అంత ఇష్టం ప్రేమ, దైర్యం అని అంటుంది. నాకు పెళ్లి జరిగినప్పుడు మిమ్మల్ని నిలదీశాను మొన్నటికి మొన్న మీపై నేను కోపడ్డాను. నాకు ఈరోజు అర్థమైంది మీరు నాకు ఎప్పుడు అన్యాయం చేయలేదు నాతోనే ఉన్నారు ఉంటారని అని అంటుంది మల్లీ.