స్కూల్ మేట్ ను పెళ్లి చేసుకోబోతున్న కీర్తి సురేష్? స్పందించిన మహానటి తల్లి.. ఏమంటున్నారంటే?

First Published | Jan 31, 2023, 12:36 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) పెళ్లి ఇప్పుడు అప్పుడంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల కాస్తా గట్టిగానే వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా ఆమె తల్లి స్పందించారు. 
 

‘మహానటి’తో హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అందం, నటనతో జాతీయ స్థాయిలో అవార్డును అందుకున్నారు. దీంతో సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అప్పటి నుంచి కీర్తికి ఆడియెన్స్ లో ప్రత్యేక స్థానం ఏర్పడింది. 
 

కీర్తి సురేష్ సినిమాల కోసం అభిమానులు ఎంతలా ఎదురుచూస్తుంటారో తెలిసిందే.  ఈ క్రమంలో వరుస చిత్రాలను అనౌన్స్ చేస్తూ వస్తోంది. ఇదిలా ఉంటే.. తన పెళ్లికి సంబంధించిన వార్తలు కూడా నెట్టింట పుట్టుుకొస్తున్నాయి. దీనిపై కీర్తి సురేష్ తల్లి, నటి మేనక స్పందించారు. 
 


నటి కీర్తి సురేష్ పెళ్లిపై ఎప్పటికప్పుడు పుకార్లు వస్తున్నాయి. అందులో కీర్తి సురేష్ తన స్కూల్ ఫ్రెండ్‌తో ప్రేమలో ఉన్నారని, గత 10 ఏళ్లుగా ఈ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని ప్రచారం జరిగింది.  వీరి ప్రేమకు ఇరువురి తల్లిదండ్రుల అంగీకరమూ ఉందన్నారు. వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారని అంటున్నారు. 
 

దీనిపై తాజాగా నటి కీర్తి సురేష్ తల్లి మేనక (Menaka) స్పందించినట్టు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీని ప్రకారం.. కీర్తి పెళ్లి వార్తలను ఖండిస్తూ మేనక క్లారిటీ ఇచ్చారు. పెళ్లిపై వచ్చిన కథనాలు అవాస్తవమని.. సంచలనం కోసం ఇలా చేస్తున్నారని చెప్పుకొచ్చారు. 

ఇటీవల ఇంటర్వ్యూల్లో కీర్తి సురేష్ కూడా స్పందించారు. తన పెళ్లిపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. అవి వట్టి పుకార్లేనన్నారు. తనకు ఇప్పుడే పెళ్లిపై ఆశల లేదని తన వెర్షన్ ను వినిపించారు. ఇటు తల్లి, అటు కూతురు స్పందించడంతో రూమర్లకు అడ్డుకట్ట పడినట్టైంది.
 

ప్రస్తుతం కీర్తి సురేష్ ‘దసరా’ చిత్రం రిలీజ్ కు సిద్ధం అవుతోంది. మరోవైపు చిరంజీవి సరసన ‘భోళా శంకర్’లోనూ కీలక పాత్రలో నటిస్తోంది.  మరోవైపు తమిళంలో ఏకంగా నాలుగు  సినిమాల్లో నటిస్తూ బిజీ షెడ్యూల్ ను కొనసాగిస్తోంది. క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నారు. 

Latest Videos

click me!