Malli: మల్లీని ఇంటర్వ్యూకి తీసుకెళ్తున్న అరవింద్.. ఎమోషనల్ అవుతున్న మాలిని?

Published : Feb 02, 2023, 02:36 PM IST

Malli: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న మల్లీ సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఇక ఈరోజు ఫిబ్రవరి 2వ ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

PREV
17
Malli: మల్లీని ఇంటర్వ్యూకి తీసుకెళ్తున్న అరవింద్..  ఎమోషనల్ అవుతున్న మాలిని?

ఈరోజు ఎపిసోడ్ లో అరవింద్ నేను మల్లీతో కలిసి అడుగులు వేసాను సార్. ఈరోజు అరవింద్ మీ ముందు ఇలా ఉన్నాడు అంటే దానికి కారణం మల్లీ. అంతే కాదు సార్ నేను ఆరోజు మల్లీ కి మాట కూడా ఇచ్చాను నేను తనని ఇంటర్వ్యూ చేస్తానని అని అంటాడు. అప్పుడు అరవింద్ వాళ్ళ సార్ సరే అనడంతో సంతోషంతో అరవింద్ ఇంటికి వెళ్తాడు. అప్పుడు సంతోషంతో అందరినీ పిలవగా ఏంటి అంత ఆనందంగా ఉన్నావు అరవింద్ అని వాళ్ళ అమ్మ అడగడంతో నేనే కాదమ్మా నేను చెప్పే గుడ్ న్యూస్ చెప్తే అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు అని అంటాడు. అదేంటి అనడంతో మల్లీ సాధించిన విజయం గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
 

27

మా న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా మల్లీ నీ ఇంటర్వ్యూ చేయడానికి పోటీ పడుతున్నాయి అని చెప్పడంతో అందరూ సంతోష పడుతూ ఉంటారు. ఇప్పుడు అందరూ కలిసి మల్లీ సెలబ్రిటీ అయిపోయింది అని సరదాగా ఆటపట్టిస్తూ ఉంటారు. అప్పుడు మల్లీ నేను ఆ ప్రెస్ మీట్ కి వెళ్ళను అమ్మగారు అంటుంది. ఎందుకు మల్లీ అనడంతో ప్రెస్ మీట్ అంటే చాలామంది ఉంటారు.  చాలా కెమెరాలు ఉంటాయి అంత మంది ముందు మాట్లాడాలి అంటే నాకు కొంచెం భయంగా ఉంది అమ్మగారు అంటుంది. అప్పుడు అరవింద్ తింగరిగా మాట్లాడకు నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా బాధపడ్డావా, భయపడ్డావా అని అంటాడు. మీ ఊర్లోని స్కాలర్షిప్ వచ్చింది అన్న విషయాన్ని అందరికీ చెప్పావు కదా అని అనగా అది మా ఊరు కానీ ఇప్పుడు అందరూ కొత్తవాళ్లు కదా నాకు భయంగా ఉంది బాబు గారు అంటుంది మల్లీ.
 

37

మరి నేను నీ పక్కన ఉంటే అనగా,చాలా ధైర్యంగా ఉంటుంది బాబు గారు అనగా ఇంట్లో వాళ్ళు అందరూ ఆశ్చర్యపోతారు. నేను నిన్ను స్వయంగా ఇంటర్వ్యూ చేస్తాను అనడంతో ఇంట్లో అందరూ సంతోషపడుతుండగా మల్లీ మాత్రం వెళ్లడానికి భయపడుతూ ఉంటుంది. అప్పుడు మల్లీ నువ్వేం టెన్షన్ పడకు అక్కడ ఏమి అడుగుతారు ఏం మాట్లాడాలి అన్నది ఈరోజు నేను నీకు నేర్పిస్తాను అంటాడు అరవింద్. అప్పుడు అరవింద్ వాళ్ళ అమ్మ మల్లీ నువ్వే చెప్పావు కదా మళ్ళీ అరవింద్ నీ పక్కన ఉంటే ధైర్యంగా ఉంటుందని అలాంటప్పుడు ఎందుకు భయపడతావు అని ధైర్యం చెబుతుంది. అప్పుడు నువ్వేం మాట్లాడకు మల్లీ నువ్వు ప్రెస్ మీట్ కి వెళ్తున్నావు అనడంతో మల్లీ టెన్షన్ పడుతూ ఉండగా అప్పుడు అరవింద్ వాళ్ళ పెద్దమ్మ అమ్మ ఇద్దరు కలిసి మల్లీ దగ్గరికి వెళ్లడానికి ఒప్పిస్తారు.
 

47

మరొకవైపు వసుంధర శరత్ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని ఆ మల్లీని ఆ ఇంటి నుంచి ఎంత దూరం చేయాలి అనుకుంటున్నా కుదరడం లేదు అనుకుంటూ ఉంటుంది. రేపు ఆ మల్లీని ఇంటర్వ్యూ చేస్తామని అంటున్నారు అదే గనక జరిగితే మా ఇంట్లో ఆ ఇంట్లో ఇంకా మల్లీ జపమే ఉంటుంది అనుకుంటూ ఉంటుంది వసుంధర. ఎలా అయినా మల్లీ నీ అవమానించాలి అని ఇంతలోనే ఒక ఐడియా రావడంతో అతనికి ఫోన్ చేస్తుంది. నీకు ఆ పని పడింది నువ్వు ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ చేయాలి అని అనగా ఎవరు మేడం అనడంతో మల్లీ అనగా ఆ ఇంటర్ సెకండియర్ వచ్చిందే పల్లెటూరి అమ్మాయిల అనగా అవును అంటుంది వసుంధర. ఏం చేయాలో ఏం అడగాలో చెప్పండి మేడం ఆడంతో వసుంధర అతనికి ప్లాన్ మొత్తం వివరిస్తూ ఉంటుంది.
 

57

ఇక మీరు ప్రశాంతంగా ఉండండి ఆ జూబ్లీ హిల్స్ హౌస్ గురించి ఆలోచిస్తూ ఉండండి మేడం అనడంతో వసుంధర సంతోషంగా ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత అరవింద్ వాళ్ళ అమ్మ పెద్దనాన్న అందరూ కూడా సంతోషంగా మళ్ళీ గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే మళ్లీ అరవింద్ అక్కడికి వస్తారు. ఇప్పుడు మల్లీ ని చూసి అందరూ సంతోష పడుతూ మాది ఇచ్చి తగిలేలా ఉంది వెళ్లేటప్పుడు గుడికి తీసుకొని వెళ్ళు అరవింద్ అని అంటుంది అరవింద్ వాళ్ళ అమ్మ. నువ్వు ఏమి టెన్షన్ పడకు అరవింద్ నీ పక్కనే ఉంటాడు. మరోవైపు మాలిని రెడీ అవుతూ ఉండగా పక్కనే అరవింద్ ఫోటో చూసి తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత మాలిని అందంగా రెడీ అయి కిందికి వెళుతుంది.
 

67

 అప్పుడు అరవింద్ మనం షాపింగ్ కి వెళ్లడానికి ఈసారి ఓకే కదా అనడంతో అరవింద్ షాక్ అవుతాడు. అందరూ మాలిని వైపు అలాగే చూస్తూ ఉంటారు. అప్పుడు మాలిని ఏంటి మల్లీ కొత్త మల్లీ బర్త్డే నా న అనడంతో నీకు అసలు విషయం తెలియదా మాలిని ఈరోజు అన్ని చానల్స్ వాళ్ళు కలిసి ఇంటర్వ్యూ చేయబోతున్నారు అనడంతో మాలిని సంతోష పడుతూ ఉంటుంది. ఇంటర్వ్యూ ఎన్ని గంటలకి అనడంతో ఇంకొక గంటకి అని అంటాడు వాళ్ళ మామయ్య. అయ్యో నెక్స్ట్ వీక్ మా ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్ ఉంది నేను అరవింద్ కలిసి షాపింగ్ కి వెళ్తున్నాము లేకపోతే ఇంటర్వ్యూకి వచ్చేవాళ్ళము అని అంటుంది మాలిని. అప్పుడు అరవింద్ వల్ల పెదనాన్న అదేంటమ్మా మల్లీ నీ ఇంటర్వ్యూకి తీసుకెళ్తుంది.

77

అరవింద్, అంతేకాదు మల్లీ నీ ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్లలో అరవింద్ కూడా ఒకడు అనడంతో మాలిని షాక్ అవుతుంది. అప్పుడు అవును మాలిని అని అరవింద్ అనడంతో మాలిని అరవింద్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. నేను నీకు టు డేస్ ముందే చెప్పాను కదా అరవింద్ అని మాలిని ఎమోషనల్ అవుతుంది. అప్పుడు మాలిని ఎమోషనల్ అవుతూ ఉండగా అర్థం చేసుకోవాలని సారీ అని అంటాడు అరవింద్. ఆ తర్వాత అరవింద్, మల్లీ ఇద్దరూ కలిసి ఇంటర్వ్యూ కి వెళ్తూ ఉండగా అది చూసి మాలిని ఎమోషనల్ అవుతుంది.

click me!

Recommended Stories