జనవరిలో ఎంగేజ్‌మెంట్‌.. ఆగస్టులో బ్రేకప్‌.. నాని విలన్ ఇంత పనిచేశాడేంటి..?

First Published | Aug 6, 2024, 11:12 PM IST

ఈమధ్య ఫిల్మ్ ఇండస్ట్రీలో పెళ్లిళ్ళు.. విడాకులు ఎక్కువైపోతున్నాయి. పెళ్లైన కొంత కాలానికే స్టార్ జంటలు విడిపోతున్నారు. కాగా మరో విచిత్రం ఏంటంటే.. పెళ్లికి ముందే బ్రేకప్ చెప్పుకునే జంటలు పెరిగిపోతున్నారు. 

భాష ఏదైనా.. ఫిల్మ్ ఇండస్ట్రీలలోకామన్ గా జరిగే కొన్ని విషయాలు ఉన్నాయి. అదే ప్రేమ పెళ్ళిళ్లు.. విడాకులు.. బ్రేకప్ లు. ఇవి ఈమధ్య కామన్ అయిపోయాయి. ప్రేమించుకుని .. పెళ్ళాడి.. కొంత కాలానికి విడిపోయే స్టార్లతో పాటు.. 20 ఏళ్ళు కాపురం చేసిన తరువాత కూడా విడిపోయేవారు ఉన్నారు ఇండస్ట్రీలో.. అంతే కాదు ప్రేమించి.. పెళ్ళిదాకా వచ్చిన తరువాత కూడా బ్రేకప్ చెప్పుకుంటున్న స్టార్స్ పెరిగిపోతున్నారు ఈ మధ్య. 

ఇదిగో ఆ కోవలోనే చేరాడు మలయాళ స్టార్  నటుడు షైన్‌ టామ్‌ చాకో. ఈ పేరు ఇలా చెపితే గుర్తు పట్టరేమో కాని.. నేచురల్ స్టార్ నాని దసరా సినిమాలో విలన్ అంటే వెంటనే గుర్తు పట్టేస్తారు. అసలే అవ్వక అవ్వక నాలుగు పదుల వయస్సులో పెళ్ళి చేసుకుందాం అనుకున్న చాకో..  పెళ్లికి ముందే బ్రేకప్‌ చెప్పేశాడు. కారణం ఏంటంటే.. ?  దసరా సినిమాలో విలన్‌గా నటించిన 40 ఏళ్ల షైన్‌ టామ్‌ చాకో జనవరిలో తన లవర్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. తాజాగా ఇప్పుడు బ్రేకప్‌  చెప్పాడు. 
 


మలయాళ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నటుడిగా కొనసాగుతున్నాడు  షైన్‌ టామ్‌ చాకో. నమ్మల్‌ , సాల్ట్ అండ్ పెప్పర్, చాప్టర్స్, 5 సుందరిగళ్, వినోద్ అక్క సూంట, దా తాడియా లాంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన చాకో.. విలన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. మలయాళంలో  విలన్‌ పాత్రలతో పాటు..  వైవిధ్యమైన పాత్రలతో  ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు చాకో.
 

మాలయాళంతో పాటు.. చిన్నగా తమిళ, తెలుగు పరిశ్రమలకు కూడా దగ్గరయ్యాడు చాకో. దళపతి విజయ్ నటించిన బీస్ట్ సినిమాలో  టెర్రరిస్ట్ పాత్రలో నటించి కోలీవుడ్ కు దగ్గరయ్యాడు. ఆవెంటనే.. డబుల్ ఎక్స్‌, జిగర్తాండ సినిమాల్లో  కీలక పాత్రలు చేశాడు చాకో.  ఇక తెలుగులో నాని నటించిన దసరా సినిమాలో చాకో పోషించిన విలన్ పాత్రను ఎవరు మర్చపోలేరు. ఇలా చాలా తక్కువ టైమ్ లో   సౌత్‌ ఇండియాలో స్టార్  నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు  షైన్‌ టామ్‌ చాకో.
 

ఇక ఈ నటుడు  తన ఫ్రెండ్‌, మోడల్‌ తనూజాతో జనవరిలో నిశ్చితార్థం చేసుకున్నాడు. 40 ఏళ్ళ వయస్సులో పెళ్ళికి సిద్దమైన చాకో.. పెళ్లి తేదీని త్వరలో ప్రకటిస్తానని కూడా  ఈ మధ్య చెప్పాడు. అయితే రీసెంట్ గా  సోషల్‌ మీడియాలో తనూజాతో కలిసి ఉన్న ఫోటోలను షైన్‌ టామ్‌ చాకో తొలగించడంతో అందరిలో అనుమానాలు మొదలయ్యాయి.  వారిద్దరి మధ్య విభేదాలు వచ్చినట్టు ప్రచారం జరిగింది. 
 

ఇక వీటన్నింటికి క్లారిటీ ఇస్తూ.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను మళ్లీ సింగిల్‌ అని చెప్పాడు చాకో. దాంతో  ఎంగేజ్‌మెంట్‌ బ్రేక్‌ అయ్యిందని  అందరు అర్ధం చేయసుకోవలసి వచ్చింది. తమ బంధం కలుషితంగా మారిందని చెప్పిన చాకో ఇద్దరి మధ్య ఒకరినొకరికి ప్రేమ ఉన్నప్పటికీ కలిసి కొనసాగలేకపోయానని ఒప్పుకున్నాడు. ప్రస్తుతం  తాను డేటింగ్ యాప్‌పై దృష్టి పెట్టానని, తనకు నచ్చిన  యువతి కోసం వెతుకుతున్నానని కూడా తెలిపాడు. 

అయితే ఇంకో విషయం ఏంటంటే.. చాకోకు ఇంతకు ముందే పెళ్ళి జరిగింది.  తబితా మాథ్యూస్ అనే యువతితో ఇంతకు ముందే చాకో పెళ్లయ్యింది. వీరికి ఓ కూతురు కూడా ఉంది.  కొంత కాలం కిందట  వీరు  విడాకులు తీసుకున్నారు. దాంతో మరో పెళ్లి చేసుకోవడం కోసం షైన్ టామ్ చాకో చూస్తున్నాడు. 

Latest Videos

click me!