స్టార్ డైరక్టర్ తమ్ముడు.. భార్య, కూతురికి టార్చర్‌.. అరెస్ట్

First Published | Oct 15, 2024, 4:04 PM IST

'కంగువ' దర్శకుడు శివ ఇతడికి అన్నయ్య అవుతాడు. 2006 నుంచి బాల.. నటుడిగా కొనసాగుతున్నాడు.

kaguva, siva, bala,

మలయాళ ప్రముఖ నటుడు బాల అరెస్ట్ అయ్యాడు. కొచ్చిలోని అతడి ఫ్లాట్‌లో ఉండగా..  పోలీసులు ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. మాజీ భార్య అమృత సురేశ్ ఫిర్యాదు చేయడంతోనే ఇదంతా జరిగింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

బాల తమిళ-మలయాళ సినిమాలు చేసే నటుడు. 'కంగువ' దర్శకుడు శివ ఇతడికి అన్నయ్య అవుతాడు. 2006 నుంచి బాల.. నటుడిగా కొనసాగుతున్నాడు. 2010లో సింగర్ అమృత సురేశ్‌ని పెళ్లి చేసుకున్నాడు. 2012లో వీళ్లకు పాప కూడా పుట్టింది. ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. 2019లో విడాకులు తీసుకున్నారు. బాల మరో పెళ్లి చేసుకుని ఆమెకు కూడా విడాకులు ఇచ్చేశాడు. 

kaguva, siva, bala,


ఈ మధ్య సోషల్ మీడియాలో, పలు ఇంటర్వ్యూల్లో తమ పరువు తీసేలా బాలా ప్రవర్తిస్తున్నాడని.. ఇతడి మాజీ భార్య అమృత తాజాగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన కూతురి వెంటపడటంతో పాటు వేధిస్తున్నాడని పేర్కొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.

కొచ్చిలో బాలాతో పాటు అతడి మేనేజర్, ఫిల్మీ ఫ్యాక్టరీ యూట్యూబ్ ఛానెల్ యజమానికి కూడా అదుపులోకి తీసుకున్నారు. చిన్న పిల్లని వేధించిన కారణంగా జువైనల్ యాక్ట్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. బాలా తనని వేధిస్తున్నాడని చెప్పి అమృత.. గతంలో రెండు మూడుసార్లు గృహ హింస కేసు పెట్టింది. ఇప్పుడు విడాకుల నిబంధనని మీరి తమని వేధిస్తున్నాడని అమృత కేసు పెట్టడంతో ఈ గొడవ కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.


kaguva, siva, bala,


  బాల (బాలకుమార్) అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే బెయిల్‌పై బయటకొచ్చారు. మాజీ భార్య అమృత సురేశ్ ఫిర్యాదు చేయడంతో బాలను  పోలీసులు అరెస్ట్ చేశారు. విడాకుల తర్వాత బాలా తనతో పాటు కుమార్తెను కూడా వేధించాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కొచ్చిలోని కడవంతర పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని అనంతరం కోర్టులో హజరుపరిచారు. వారిద్దరి వాదనలు విన్న తర్వాత పలు హెచ్చరికలతో బాలకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

kaguva, siva, bala,


జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద అరెస్టు అయిన కొన్ని గంటల తర్వాత స్థానిక కోర్టు బాలకు బెయిల్ మంజూరు చేసింది. సోమవారం ఎర్నాకులం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.  అతని మాజీ భార్య అమృత సురేష్, వారి కుమార్తెపై సోషల్ మీడియాలో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని అతన్ని కోర్టు హెచ్చరించింది. భవిష్యత్‌లో విచారణాధికారులు  పిలిచినప్పుడల్లా తదుపరి విచారణ కోసం బాలా తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని కోర్టు తెలిపింది.

kaguva, siva, bala,


బాలా అరెస్టు తర్వాత మాజీ భార్య అమృత కోర్టు విచారణలో భాగంగా తన కష్టాలను వివరించింది. తాను చెప్పలేని శారీరక, మానసిక హింసను ఎదుర్కొన్నానని నటుడు బాలపై ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. '2019లో తన నుంచి విడాకులు తీసుకుని నేను దూరంగా ఉంటున్నాను.

కూతురు అవంతికతో ప్రశాంతంగా జీవిస్తున్న నాకు అతని వేధింపులు మాత్రం తగ్గలేదు. నాతో పాటు అవంతికను కూడా ఇబ్బంది పెడుతున్నాడు. మా ఇద్దరి గురించి సోషల్‌మీడియాలో తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. కనీసం సొంత కూతురని కూడా చూడకండా తప్పుడు మాటలతో దూషిస్తున్నాడు. తను ఇప్పుడు స్కూల్‌కు కూడా వెళ్లడం ఇబ్బందిగా మారింది.
 

Latest Videos

click me!