హాట్ టాపిక్: ఎన్టీఆర్ ‘దేవర’ OTT స్ట్రీమింగ్ డేట్

First Published | Oct 15, 2024, 3:40 PM IST

ప్రీ సేల్స్‌ బుకింగ్స్‌లో రికార్డులు సృష్టించిన ఈ సినిమా విడుదలయ్యాక కూడా హవా కొనసాగిస్తోంది. ఇప్పటివరకు రూ.510 కోట్లకు (గ్రాస్‌) పైగా వసూలుచేసినట్లు చిత్ర టీమ్ తెలిపింది. 

ఎన్టీఆర్‌-కొరటాల కాంబోలో వచ్చిన ‘జనతా గ్యారేజ్‌’వంటి సూపర్ హిట్ తర్వాత   వీరిద్దరూ కలిసి చేసిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘దేవర’ (Devara Movie). ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్‌ (NTR) సోలో హీరోగా చేస్తుండటం, జాన్వీ (Janhvi Kapoor) ఈ మూవీతోనే తెలుగు తెరకు పరిచయమవుతుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

అందుకు తగినట్లుగానే ఓ రేంజిలో ఓపినింగ్స్ వచ్చాయి.  డివైడ్ టాక్ వచ్చినా దసరా శెలవులను ఈ సినిమా క్యాష్ చేసుకుంది. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ‘దేవర’(Devara) గురించి, ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం మాట్లాడుతున్నారు.   భాక్సాఫీస్ దగ్గర రికార్డ్ లు బ్రద్దలు కొడుతున్న ఈ సినిమా ఓటిటి రిలీజ్ కు సైతం రెడీ అయ్యింది.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

510 కోట్ల గ్రాస్ తో దేవర


భారీ అంచనాల నడుమ విడుదల అయిన  ఈ సినిమా రిలీజ్ కు ముందే అనేక రికార్డులు నెలకొల్పింది.ప్రీ సేల్స్‌ బుకింగ్స్‌లో రికార్డులు సృష్టించిన ఈ సినిమా విడుదలయ్యాక కూడా హవా కొనసాగిస్తోంది. ఇప్పటివరకు రూ.510 కోట్లకు (గ్రాస్‌) పైగా వసూలుచేసినట్లు చిత్ర టీమ్ తెలిపింది.  

ఎన్టీఆర్‌ సరసన జాన్వీ నటించిన ఈ సినిమా సీక్వెల్‌ వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. మొదటిభాగం కంటే రెండోభాగం చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని దర్శకుడు ఇటీవల చెప్పారు. పార్ట్‌-1లో చూసింది 10 శాతమేనని.. రెండో భాగంలో 100శాతం చూస్తారన్నారు.


కొత్త రికార్డ్ తో దేవర

ఇక ఇప్పటికే పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్న దేవర సినిమా ఇప్పుడు మరో రికార్డ్  సాధించింది. దీంతో మరోసారి ఈ సినిమా పేరు ఎక్స్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ‘దేవర’ రిలీజై 18 రోజులు పూర్తవగా.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల్లో రోజూ కోటి రూపాయలు వసూలుచేసినట్లు ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. కొవిడ్‌ తర్వాత ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టిన సినిమా ‘దేవర’ (Devara) కావడం గమనార్హం. అలాగే సీడెడ్‌ ఏరియాలోనూ రూ.30 కోట్ల షేర్‌ వసూలు చేసినట్లు తెలుస్తోంది.

ntr, devara2, koratala shiva

ఇన్నాళ్లూ రాజమౌళి సినిమాలే కానీ ఇప్పుడు దేవర..

ఇప్పటివరకు రాజమౌళి తెరకెక్కించిన చిత్రాలు మాత్రమే అక్కడ ఈ స్థాయిలో కలెక్షన్లు సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ఆయన కాకుండా మరో దర్శకుడి సినిమా ఈ స్థాయిలో వసూలు సాధించడం తొలిసారి కావడం విశేషం.

దీంతో సీడెడ్‌ ఏరియాలో రూ.30 కోట్లు దాటిన రెండు సినిమాలు ఉన్న ఏకైక హీరోగా ఎన్టీఆర్‌ నిలిచారు. ఆయన అభిమానులు ఈ వార్తను షేర్‌ చేస్తుండడంతో ‘దేవర’ హ్యాష్ ట్యాగ్‌ ఎక్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

ntr, devara2, koratala shiva

ఇక దేవర ఓటిటి వివరాలకు వస్తే... ఈ చిత్రం స్ట్రీమింగ్ డిజిటల్ రైట్స్ ని నెట్ ప్లిక్స్ Netflix వారు సొంతం చేసుకున్నారు. అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం నవంబర్ మూడవ వారంలో నవంబర్ 22 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాసం ఉందని తెలుస్తోంది.

ఓటిటిలో కూడా ఈ సినిమా భారీ రికార్డ్ లు క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు. ఇక ‘దేవర’ మరో ఘనత సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు రోజూ కోటి రూపాయలు వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. 
 

Junior NTRs Devara

  ఈ సినిమాకు బాలీవుడ్‌ నుంచి అద్భుతమైన సపోర్ట్ లభించింది. బాలీవుడ్‌ మేజర్‌ ప్లేయర్స్ ఈ చిత్రంతో చేతులు కలిపారు. ధర్మ ప్రొడక్షన్స్, ఏఏ ఫిల్స్ కలిసి ఈ సినిమాను ఉత్తరాదిన డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు. దేవర నార్త్ థియేట్రికల్‌ రైట్స్ ని కరణ్‌ జోహార్‌, అనిల్‌ తండానీ సొంతం చేసుకున్నారు. అత్యంత భారీ మొత్తం చెల్లించి ఈ మాగ్నమ్‌ ఆపస్‌ని దక్కించుకున్నారు వారిద్దరూ.  ఎన్టీఆర్‌కి ఉత్తరాదిన ఉన్న స్టార్‌డమ్‌కి, కరణ్‌ జోహార్‌, అనిల్‌ తండానీ పేర్లు యాడ్‌ కావడంతో వేరే లెవల్‌ బజ్‌ క్రియేటైంది. మరి అందుకు తగ్గ కలెక్షన్స్ వస్తున్నాయి.

ఎన్టీఆర్ కి అదో తీరని అవమానం, తిరస్కరించిన జనం, స్టార్ డైరెక్టర్ బయటపెట్టిన నిజాలు

Latest Videos

click me!