నేను హీరోయిన్ కాబట్టి ఈ సమస్యను ఎదుర్కొన్నాను. అదే నేను స్కూల్ లేక కాలేజ్ లో చదివే రోజుల్లో ఇలా జరిగితే పరిస్థితి ఏమిటీ? మహిళలు జాగ్రత్తగా ఉండాలని రష్మిక మందాన తెలియజేశారు. రష్మిక మందాన డీప్ ఫేక్ వీడియో పోస్ట్ చేసింది గుంటూరుకు చెందిన ఓ యువకుడు కావడం విశేషం. నెలల తరబడి జరిగిన విచారణలో నిందితుడిని పట్టుకున్నారు.
అనంతరం ప్రియాంక చోప్రా, అలియా భట్, నోరా ఫతేహి, కత్రినా కైఫ్, కాజోల్ సైతం ఈ డీప్ ఫేక్ వీడియో బారిన పడ్డారు. వీరి ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సైబర్ క్రైమ్ అత్యంత ప్రమాదకరంగా పరిణమించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం దీనిపై అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకుంది.