Ennenno Janmala Bandham: యశోదర్ గురించి వేదకు అబద్దం చెప్పిన మాళవిక.. పెళ్లి ఆగిపోతుందా?

Navya G   | Asianet News
Published : Feb 25, 2022, 02:21 PM IST

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి సీరియల్ ఎన్నెన్నో జన్మల బంధం.. తల్లి కూతుర్ల ప్రేమ గురించి చూపిస్తున్న ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది. అలాంటి ఈ సీరియల్ లో ఈరోజు ఏం జరిగిందో చూద్దాం..

PREV
15
Ennenno Janmala Bandham: యశోదర్ గురించి వేదకు అబద్దం చెప్పిన మాళవిక.. పెళ్లి ఆగిపోతుందా?

వేద తన డాన్స్ తో అదరగొడుతూ ఉంటుంది. వేద డాన్స్ చూసిన యశోధర్ అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇక వేద ఫ్యామిలీ, యశోదర్ ఫ్యామిలీతో పోటీపడి మరీ డాన్స్ చేస్తూ ఉంటారు. ఇక  వేద, యశోదర్ ని డాన్స్ చేయమని వేదిక మీదకు పిలుస్తారు. వేద యశోధర్ కలిసి పడి పడి లేచే మనసు అంటూ డాన్స్ చేస్తూ ఉంటారు.
 

25

సంగీత్ పార్టీకి వచ్చిన మాళవిక యశోధర్, వేద కలిసి డ్యాన్స్ చేయడాన్ని చూసి పెళ్లి చేసుకోబోయేది యశోధర్, వేద అని తెలుసుకొని ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలి అనుకుంటుంది జరిగిన విషయాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది మాళవిక. మాళవిక ను చూసిన మాలిని నువ్వు  ఇక్కడ ఏం చేస్తున్నావ్ అంటుంది. మాలిని తన కోడలు గురించి గొప్పగా చెబుతూ ఉంటుంది.
 

35

ఎలాగైనా వేద పేరును చెప్పించాలని మాలిని రెచ్చగొడుతూ ఉంటుంది. తాగిన మైకంలో ఉన్న మాలిని వేద పేరు చెప్పే సమయంలో రత్నం వచ్చి మాలినిని అక్కడినుంచి తీసుకెళ్తాడు. మాళవిక వేదని తిడుతూ ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని రగిలిపోతూ ఇంటికి వెళ్తుంది. ఇక ఈ విషయాన్ని అభిమన్యుకి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.
 

45

అభిమన్యు ఏమైంది అని అడగగా మనం మోసపోయమ్, నమ్మకద్రోహం జరిగింది అంటూ యశోధర్ పెళ్లి చేసుకోబోయేది వేదను అని చెప్పేస్తుంది. నిజం తెలుసుకున్న అభిమన్యు షాక్ అవుతాడు. మాళవికని తిడుతూ ఇక నుంచి నేను ఎలా చెబితే అలానే చేయి అంటాడు. ఇక సులోచన వేద కోసం వస్తువులన్నిటిన్నికొని తనకు ఇవ్వడానికి అన్ని సర్దుతూ ఉంటుంది.
 

55

వేదకు పెళ్లి గురించి, పెళ్లి తరువాత ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి అనే విషయాలను చెబుతుంది. వేద పెళ్లి కోసం రెడీ అవుతూ ఉండగా నిజం తెలుసుకున్న మాళవిక నాకు నిజం తెలిసిపోయింది అని చెబుతుంది. ఎలాగైనా పెళ్లి ఆపాలి అనుకున్న మాళవిక యశోదర్ నీ దగ్గర ఒక రహస్యాన్ని దాచాడు అని ఆ రహస్యం చెప్తుంది. ఆ రహస్యం ఏంటో తెలుసుకున్న వేద ఆవేశంతో యశోదర్ దగ్గరకు వెళుతుంది. మరి రానున్న ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి.

click me!

Recommended Stories