అందరూ హ్యాపీ బర్త్డే చెప్పడంతో చాలా హ్యాపీ అవుతుంది. సాయంత్రం గ్రాండ్ పార్టీ ఉందని చెప్పడంతో మరింత ఆనంద పడిపోతుంది. మరోవైపు పాచికలు ఆడుకుంటున్న మాలిని, సులోచన దగ్గరకు వచ్చి ఆదిత్య కనిపించాడా అని అడుగుతుంది మాళవిక. వాడు ఈ ఇంటి మనవడు ఎక్కడికి పోడు.. వాడిని వెతుక్కుంటూ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోకు మా ఇంటి అతిధులు ఎక్కడికైనా వెళ్ళిపోతే మాకే చిన్నతనం అంటూ మాళవిక ని ఓ ఆట ఆడుకుంటారు మాలిని, సులోచన.