మాళవిక మోహనన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె నిత్యం తన ఫోటో షూట్లతో రెచ్చిపోతుంటుంది. ఎప్పుడు ఆమె నుంచి కొత్త ఫోటోలు వస్తాయని అంతా ఎదురుచూస్తుంటారు. మాళవిక కూడా వారు ఆశించిన దాన్ని మించి సర్‌ప్రైజ్‌లిస్తూ ఆకట్టుకుంటుంది. హాట్ డోస్ పెంచుతూ వారికి ఫుల్ మీల్స్ పెడుతుంటుంది. అందుకే ఈ బ్యూటీకి బయట కంటే సోషల్ మీడియాలోనే ఫాలోయింగ్ ఎక్కువ.
తాజాగా ఈ అందాల సోయగం తనని నమ్ముకున్న, తనని ఆరాధిస్తున్న అభిమానులకు షాకిచ్చింది. నెటిజన్లకి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. ఆ మధ్య త్వరలోనే తన ప్రియుడిని పరిచయం చేయబోతున్నా అంటూ సర్‌ప్రైజ్ ఇచ్చింది. తాను ప్రేమలో ఉన్నానని, త్వరలోనే బాయ్‌ఫ్రెండ్‌ని పరిచయం చేస్తానని చెప్పింది. దీంతో వాలెంటైన్స్ డే సందర్భంగా మాళవిక తన ప్రియుడిని పరిచయం చేస్తారని అంతా ఎదురుచూశారు.
కానీ ప్రేమతో కూడిన మాటలు చెబుతూ ఓ వీడియోని షేర్ చేసింది మాళవిక.ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఆ వీడియోకి మిలియన్ వ్యూస్ రావాలని తెలిపింది. దీంతో ఆ వీడియోని లక్షలాది మంది ఎగబడి చూశారు. తీరా చూస్తే అదొక కార్ యాడ్. ఆ కార్‌ని ప్రమోట్ చేస్తూ మాళవికపై చేసిన వీడియో. తన బాయ్ ఫ్రెండ్ కారే అని కూల్‌గా చెప్పి షాకిచ్చింది. ఆమె ప్రియుడి కోసం వేచి చూసిన నెటిజన్లని ఫూల్స్ చేసింది.
దీంతో నెటిజన్లు మాళవికపై మండిపడుతున్నారు. ఇంతటి షాకిస్తుందా అంటూ నోరెళ్లబెడుతున్నారు. మాళవికపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంతో ఇన్నోసెంట్‌గా భావించామని, కానీ ఇలా షాకిస్తావని ఊహించలేదని వాపోతున్నారు. ఫ్యాన్స్ ఎమోషన్స్ తో కామెడీ చేయోద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి అభిమానులు అసంతృప్తికి మాళవిక ఎలాంటి ట్రీట్ ఇచ్చి కూల్ చేస్తుందో చూడాలి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం మాళవిక తమిళంలో ధనుష్ సరసన నటిస్తుంది. `మారన్` పేరుతో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. వాలెంటైన్స్ డే సందర్బంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ వచ్చింది. లవ్ మూడ్‌లో ఉన్న ధనుష్, మాళవిక పోస్టర్ ఆద్యంతం ఆకట్టుకుంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.
మరోవైపు తెలుగులోకి ఈ భామ ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో కలిసి నటించబోతుందట. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. `రాజా డీలక్స్` అనే పేరు వినిపిస్తుంది. ఇందులో ముగ్గురు హీరోయిన్లకు ఆస్కారం ఉందని, మెయిన్ ఫీమేల్ లీడ్‌గా మాళవికని సంప్రదించినట్టు టాక్. అలాగే శ్రీలీలని కూడా అనుకుంటున్నారని సమాచారం.
మాళవికకి తెలుగులో నటించాలనేది డ్రీమ్. ముఖ్యంగా ఆమె సూపర్ స్టార్ మహేష్‌తో నటించాలని ఉందనే తెలిపింది. ఇటీవల ఆమె అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్బంగా మహేష్‌తో కాంబినేషన్ కోసం వెయిటింగ్ అని అడగ్గా నేను కూడా వెయిటింగ్ అని చెప్పింది. ఆయనతో నటించాలని ఉందని చెప్పింది. అంతేకాదు మహేష్‌కి స్పెషల్‌గా బర్త్ డే విషెస్ కూడా చెబుతూ ఆయన్ని కాక పట్టే పనిలో ఉంది మాళవిక. మరి ఆమె కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.