అయితే ఇటీవల కొందరు నెటిజన్లు కించపరిచే విధంగా, బాడీ షేమింగ్ చేస్తూ కామెంట్స్ పెట్టడంతో గట్టిగా బుద్ధి చెప్పింది హారిక. పొట్టి, బుడ్డది అంటూ ఆమె హైట్ గురించి ట్రోల్ చేయడంతో రామయ్య వస్తావయ్యా చిత్రంలో ఎన్టీఆర్ డైలాగ్ చెబుతున్న స్టిల్ పోస్ట్ చేసి 'అర్థం అయింది కదా' అని కామెంట్ పెట్టింది. 'ఎవడు పడితే వాడు బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి కొడతా' అనే డైలాగ్ తో వార్నింగ్ ఇచ్చింది.