Salman Khan సోదరుడు అర్భాజ్ ఖాన్ తో వివాహం, ఆ తర్వాత విడాకులు లాంటి విషయాలతో మలైకా బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయాక యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ మొదలు పెట్టింది ఈ బ్యూటీ. మలైకా అర్జున్ కపూర్ కంటే వయసులో 12 ఏళ్ళు పెద్ద. దీనితో వీరిద్దరి ఎఫైర్ చూసి బాలీవుడ్ మొత్తం ముక్కున వేలేసుకుంది. అభిమానులైతే ఇలాంటి ప్రేమ వ్యవహారాలు కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోయారు.