మలైకా అరోరా మరోసారి వార్తల్లో నిలిచింది. స్ప్లిట్స్‌విల్లా కంటెస్టెంట్ సోరబ్ బేడీతో ఆమె క్లోజ్‌గా డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికే హర్ష్ మెహతాతో డేటింగ్‌లో ఉందనే ఊహాగానాల మధ్య ఈ వీడియో రావడం హాట్ టాపిక్‌గా మారింది.
మలైకా అరోరా పర్సనల్ లైఫ్ ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. గత కొన్ని నెలలుగా డైమండ్ వ్యాపారి హర్ష్ మెహతాతో ఆమె ప్రేమలో ఉందంటూ వార్తలు వస్తున్నాయి. కొన్ని వారాల క్రితం, వాలెంటైన్స్ డే సందర్భంగా వాళ్లిద్దరూ రోమ్‌లో ఉన్న ఫోటో ఒకటి వైరల్ అయింది. అయితే, ఇప్పుడు స్ప్లిట్స్‌విల్లా కంటెస్టెంట్ సోరబ్ బేడీతో మలైకా క్లోజ్‌గా డ్యాన్స్ చేస్తున్న వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో, సోరబ్‌తో మలైకా కెమిస్ట్రీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
24
మలైకా కొత్త బాయ్‌ఫ్రెండ్?
కొంతమంది నెటిజన్లు సోరబ్, మలైకా కొత్త బాయ్‌ఫ్రెండ్ అని భావిస్తున్నా.. వారిద్దరి మధ్య అలాంటిదేమీ లేదని తెలుస్తోంది. ఎందుకంటే, ఇటీవల మలైకా కొత్త రెస్టారెంట్ పార్టీకి సోరబ్ హాజరయ్యాడు. ఈ పార్టీలో మలైకా, ఇతర సెలబ్రిటీలతో దిగిన ఫోటోలను సోరబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. 'కంగ్రాచ్యులేషన్స్ @malaikaaroraofficial ఫర్ @sweeneybombay' అని క్యాప్షన్ పెట్టాడు.
34
హర్ష్‌తో ఉన్న బంధంపై ..
ఒక ప్రదర్శనలో మలైకా, హర్ష్ కలిసి కనిపించిన తర్వాత అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత కూడా ఈ జంట చాలాసార్లు కలిసి కనిపించింది. అర్జున్ కపూర్‌తో తన ప్రేమాయణం గురించి మలైకా చాలా ఓపెన్‌గా ఉండేది. కానీ, హర్ష్‌తో ఉన్న బంధంపై ఆమె ఇంకా స్పందించలేదు. వీరిద్దరి మధ్య వయసులో చాలా తేడా ఉంది. మలైకా వయసు 52 ఏళ్లు కాగా, హర్ష్ వయసు 33 ఏళ్లు అని సమాచారం. అంటే ఇద్దరి మధ్య దాదాపు 19 ఏళ్ల గ్యాప్ ఉంది.
సినిమాల్లో తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లకు మలైకా చాలా ఫేమస్. చివరిసారిగా ఆమె 2025లో వచ్చిన 'తమ్మ' సినిమాలో 'పాయిజన్ బేబీ' అనే పాటలో కనిపించింది. ఆమె తదుపరి ఏ సినిమాలో లేదా ఏ పాటలో కనిపించనుందో ఇంకా తెలియలేదు. దాని కోసం వేచి చూడాలి.