స్వతంత్రంగా బ్రతకండి.. విడాకులు తీసుకున్న మహిళలకు మలైకా సలహా, ట్రోలర్స్ పై మండిపడిన బాలీవుడ్ బ్యూటీ

Published : Apr 23, 2022, 08:21 AM IST

ప్రతీ మహిళ స్వతంత్రంగా బ్రతకడం అలవాటు చేసుకోవాలి అంటుంది బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా. తన తల్లి తనకు ఇచ్చిన ధైర్యంతోనే ఈ స్థాయికి వచ్చానంటోంది బ్యూటీ. తన డేటింగ్ విషయంలో ట్రోలింగ్ చేసేవారికి గట్టిగానే సమాధానం చెప్పింది మలైకా.

PREV
19
స్వతంత్రంగా బ్రతకండి.. విడాకులు తీసుకున్న మహిళలకు మలైకా సలహా, ట్రోలర్స్ పై మండిపడిన బాలీవుడ్ బ్యూటీ

ఈ సమాజంలో మహిళలై మాటలతో దాడులు ఎక్కువ అంటోంది మలైకా. ఇటువంటి సమాజంటో ధైర్యంగా ఎలా బ్రతకాలో  అమ్మ నుంచి నేర్చుకున్నానంటోంది మలైకా.  నాకు నచ్చిన జీవితం జీవించమని నాకేప్పుడు మా అమ్మ చెబుతూ ఉంటుంది. నేను ఒక ఇండిపెండెట్‌ ఉమెన్‌ని. నా జీవితాన్ని ఎలా జీవించాలనేది నా వ్యక్తిగతం అంటోంది మలైకా. 
 

29

విడాకులు అనంతరం ప్రతి స్త్రీ లైఫ్‌లో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి. వాటన్నింటిని అధిగమించి మహిళలు ధైర్యంగా జీవించాలి అని విడాకులు తీసుకున్న ప్రతీ మహిళకు  మలైకా సూచించింది. ఒంటిరి మహిళపై ఎన్నో కళ్లు ఉంటాయి. వారిని ఇబ్బంది పెట్టడానికి చాలామంది చూస్తారంటోంది మలైకా .
 

39

బాలీవుడ్ లో చాలా ప్రేమ జంటలు ఉన్నాయి. కాని చిత్ర విచిత్రమైన పెయిర్ అంటే మాత్రం అర్జున్‌ కపూర్‌, మలైకా అరోరా పేర్లు వినిపిస్తాయి. ప్రేమలో మునిగితేలుతున్న ఈజంట ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇక చాలా కాలంగా డేటింట్ లో ఉన్న జంట   ఈ ఏడాది పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ న్యూస్ హల్ చల్ చేస్తోంది. 

49

 బాలీవుడ్ లో చాలా ప్రేమ జంటలు ఉన్నాయి. అందులో చాలా జంటలు ఇప్పటికే పెళ్ళి చేసేసుకున్నారు. కాని  ఈజంటే హాట్ టాపిక్ ఎందుకు అయ్యారంటే అర్జున్‌ వయసు 36 కాగా, మలైకాకు 48 ఏళ్లు. వీళ్లిద్దరి మధ్య 12 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉండటంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే వీరి ఏజ్ గ్యాప్ వల్ల తరచూ ట్రోల్స్‌ ఎదుర్కొంటోంది ఈ జంట. 

59

ఎంత మంది ఏ అనుకున్న సరే మాకేంటి అంటూ.. సోషల్ మీడియాలో వస్తున్న రూమార్లను అవాయిడ్‌ చేస్తు.. వారి పని వారు చేసుకుంటుపోతున్నారు. అలాగే వీరిద్దరూ మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి వారి రిలేషన్‌, ఏజ్‌ రిఫరెన్స్‌పై ప్రశ్నలు ఎదురువుతూనే ఉన్నాయి. 

69

అయితే చాలా మంది సెలబ్రిటీలు ఇటువంటి విషయంలో తప్పించుకోవాలి అని చూస్తారు. కాని ఈజంట మాత్రం భయపడకుండా .. ఆ ప్రశ్నలను  దాటేయకుండ ధీటూగా సమాధానం ఇస్తూ వస్తున్నారు. విమర్షించేవారి నోళ్ళను మూయించేలా సమాధాణాలు ఇస్తున్నారు బాలీవుడ్ హాట్ కపుల్. 

79

ఇక రీసెంట్ ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న మలైకాకు మరోసారి ఈ విషయంలోనే ప్రశ్న ఎదురయ్యింది.  దీనిపై ఈసారి ఘాటుగా  స్పందించిన మలైకా.. ఓరకంగా అసహనానికి లోనైంది. ఎందుకు అందరు ఈ విషయాన్ని పెద్దదిగా చూస్తున్నారంటూ ట్రోలర్స్‌పై మండిపడింది. 

89

అంతే కాదు మన సమాజంలో వయసులో చిన్న వాడితో డేటింగ్ చేయడాన్ని తప్పుగా ఎందుకు భావిస్తున్నారో అర్థం కావడం లేదంటూ మండి పడింది మలైకా. ఇటువంటి వాటిని అస్సలు తను పట్టించుకోనని తెగేసి చెప్పింది మలైకా అరౌరా. ప్రేమకు వయసుతో సంబంధం లేదు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి’అంటూ సమాధానం ఇచ్చింది.

99

కాగా ఈ బాలీవుడ్ కపుల్ బ్రేకప్ చెప్పుకోబోతున్నారంటూ రూమర్స్ కూడా వినిపించాయి. ఇక  మలైకా అరోరా  రీసెంట్ గా  రోడ్డు ప్రమాదానికి గురైంది. ముంబై పూణే ఎక్స్ ప్రెస్ హైవే మీద పన్వేల్ సమీపంలో ఈ నెల 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో మలైకా స్వల్ప గాయాలతో బయటపడింది.
 

Read more Photos on
click me!

Recommended Stories