అప్పుడు రిషి ఒకేసారి కోపంగా గౌతమ్ వైపు చూస్తాడు అప్పుడు గౌతమ్, నేను నీకు భయపడే వాడిని కాదు చెప్పు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వసు మీకు దొరకదు. ఇదే నీకున్న చివరి అవకాశం అని గౌతమ్ అనగా, రిషి నేను ఒకటి అనుకున్నాను. అది అయితే మంచిగా జరుగుతుంది అని అంటాడు,ఒకవేళ అవ్వకపోతె అని గౌతమ్ అడగగా,అవ్వకపోతే అవ్వదు ఇంక వదిలేయ్ అని అంటాడు రిషి.నీకు వసుధారకి మధ్య గొడవలేమీ లేవు అసలు సమస్య మీ ఇద్దరే. మీకు మీ ఇద్దరూ ఇష్టమే కానీ ఒకరికొకరు అర్థం చేసుకొని మాట్లాడుకోలేరు అలా ఒకసారి మాట్లాడితే మీరు కలిసిపోతారు అని అంటాడు గౌతమ్. ఇప్పుడు దీని గురించి ఇంకేం మాట్లాడద్దు అని రిషి అనగా ఆ మాటలు విన్న వాసు అక్కడి నుంచి బయటకు వస్తుంది.