Published : Aug 23, 2022, 10:54 AM ISTUpdated : Aug 23, 2022, 10:56 AM IST
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఆయన భార్య.. రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ఈ ఏడాది ప్రారంభంలో డివోర్స్ తీసుకుంటున్నట్టు అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి దూరంగా ఉంటూ వస్తున్న ఈ జంట.. రీసెంట్ గా మళ్లీ కలిసి సందడి చేశారు. పిల్లలతో ఎంజాయ్ చేశారు.
విడాకులు ప్రకటన తరువాత దాదాపు 8 నెలలకు మళ్ళీ కలిసి కనిపించారు కోలీవుడ్ మాజీ దంపతులు ధనుష్ - ఐశ్వర్య. వీరిద్దరు మళ్లీ కలుస్తున్నారా. అన్న సంతోషంలో ఉన్నారు తమిళ తంబీలు. కాని వీరు తమ పిల్లల కోసం కలిసినట్టు తెలుస్తోంది.
26
ఈ తమిళ స్టార్ జంటకు యాత్ర, లింగ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాజాగా పెద్ద కొడుకు యాత్ర స్కూల్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ఈ మాజీ కపుల్ హాజరయ్యారు. యాత్ర స్కూల్ లో స్పోర్ట్స్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. దీని కోసం వీరిద్దరూ కలిసి హడావిడి చేశారు. మునిపటిలా భార్య భర్తల మాదిరి కలిసిపోయారు.
36
ఈ కార్యక్రమంలో ధనుష్, ఐశ్వర్య తమ పిల్లలతో కలిసి ఫోటోలు దిగారు. ఆ సందర్భంలో వారిద్దరూ గతంలోమాదిరిగానే క్లోజ్ గా మాట్లాడుకున్నారు కూడా. మొదటి సారి విడాకుల తర్వాత వీరిద్దరూ ఇలా కలిసి కనిపించడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు.
46
ఇక రీసెంట్ గా ఐశ్వర్య రజనీ కాంత్ తన కొడుకు ఫోటోను తీస్తున్నట్టు ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పోస్ట్ కు చిన్న ట్యాగ్ కూడ రాసింది. ఈ రోజు చాలా బాగా మొదలయ్యేయింది. నా పెద్ద కొడుకు స్పోర్ట్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు అంటూ.. మురిసిపోయింది ఐశ్వర్య రజనీకాంత్. అంతే కాదు ధనుష్, పిల్లలతో కలిసి దిగిన ఫోటోని కూడా తన స్టోరీలో పోస్ట్ చేసింది.
56
కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్, ఐశ్వర్య కొన్ని నెలల క్రితం విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే విడిపోయిన తర్వాత అందరి భార్య భర్తల్లా అసలు మాట్లాడుకోకుండా, గొడవలతోనో, ఒకరి మీద ఒకరు నెగిటివ్ గా చెప్పడం లాంటివి చేయకుండా ఇద్దరూ ఫ్రెండ్స్ లానే ఉంటున్నారు.
66
అందరిలా కాదు మేమ్ స్పెషల్ అని నిరూపిస్తున్నారు ఈ తమిళ జంట. విడాకుల తర్వాత కూడా ఫ్రెండ్లీగానే ఉంటామ్ అని ప్రూ చేస్తున్నారు. ఐశ్వర్య ఓ ప్రైవేట్ సాంగ్ డైరెక్షన్ చేస్తే ఆ సాంగ్ ని షేర్ చేసి మరీ ఆల్ ది బెస్ట్ చెప్పాడు ధనుష్. తాజాగా పిల్లల కోసం విడాకుల తర్వాత మొదటిసారి కలిశారు ఈ మాజీ కపుల్.