నాగ చైతన్య మరోసారి కెరీర్ పై ఫోకస్ పెట్టాల్సిన సమయం వచ్చింది. చైతు చివరగా నటించిన థాంక్యూ, లాల్ సింగ్ చడ్డా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచాయి. లాల్ సింగ్ చద్దా పూర్తిగా చైతు చిత్రం కానప్పటికీ అతడి బాలీవుడ్ ఆశల్ని నీరుగార్చింది. ఇక థాంక్యూ చిత్రంపై అక్కినేని ఫాన్స్ కూడా నిరాశ వ్యక్తం చేశారు.