Guppedantha Manasu: అనుకున్నది సాధించావంటూ రిషికి ఫోన్ చేసి షాక్ ఇచ్చిన మహేంద్ర.. వసుని మళ్ళీ తిట్టినా జగతి!

Navya G   | Asianet News
Published : Jan 01, 2022, 09:30 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో కొనసాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకెళుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
17
Guppedantha Manasu: అనుకున్నది సాధించావంటూ రిషికి ఫోన్ చేసి షాక్ ఇచ్చిన మహేంద్ర.. వసుని మళ్ళీ తిట్టినా జగతి!

మహేంద్ర (Mahendra) జగతిని ఎందుకు ఇలా ప్రవర్తించవు నీ వెనుకాల ఎవరో ఉన్నారు. రిషి ఏమైనా చెప్పాడా అని అడుగుతాడు. అసలు రిషి ఎందుకు వచ్చాడని అడుగుతాడు. ఇక జగతి నన్ను ఎం అడగవద్దు నువ్వు నా గురించి ఎలా అనుకుంటే అలా అని జగతి (Jagathi) సమాధానం చెబుతుంది. 
 

27

మరోవైపు రిషి (Rishi) జరిగిన దాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. పక్కన ఉన్న గౌతమ్ తను గీసే బొమ్మ గురించి వర్ణిస్తూ ఉంటాడు. దానికి రిషి చిరాకు పడతాడు. ఈలోపు మహేంద్ర (Mahendra) రిషి కి కాల్ చేసి మొత్తానికి నువ్వు అనుకున్నదే సాధించావ్ రిషి అని కాల్ కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు.
 

37

ఒకవైపు వసుధార (Vasudhara) జరిగిన దాని గురించి అదేపనిగా ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు జగతి (Jagathi) అక్కడకు నవ్వుకుంటూ వచ్చి అయిన నేను వెళ్ళమంటే నువ్వు వెళ్లడమేనా.. నా మనసు గురించి నీకు తెలియదా అని అడుగుతుంది. ఇక వసుధార కు ఎం జరుగుతుందో ఏమీ అర్ధంకాదు.
 

47

మరోవైపు రిషి, (Rishi) వసు తో కలిసి దిగిన ఫోటోలు, వసు ఆడిన గోళీలు చూస్తూ మురిసి పోతూ ఉంటాడు ఈలోపు గౌతమ్ (Gautham) అక్కడకు వచ్చి డ్రీమ్ చెడగొడతాడు. అదీ కాకా గోళీలను కూడా లాక్కుంటాడు. దాంతో రిషికి కోపం వస్తుంది. గోళీలను లాక్కుంటాడు.
 

57

తరువాత (Gautham) ఈ గోళీలలో ఏముందిరా అంతగా ఫీల్ అవుతున్నావ్ అని అడుగుతాడు. దాంతో రిషి (Rishi) వసు జ్ఞాపకాలను ఊహించుకుంటూ దీనిలోనే లైఫ్ ఉంది అన్నట్లు డబల్ మీనింగ్ లో అర్ధం కాకుండా చెబుతాడు. కానీ గౌతమ్ కు ఏమీ అర్ధం కాదు.
 

67

మరోవైపు వసుధార (Vasudhara) పడుకొని ఉండగా జగతి  (Jagathi) అక్కడకు వచ్చి.. తన తలపై నిమురుతూ నన్ను క్షమించు వసు నిన్ను ఇబ్బంది పెట్టక తప్పలేదు అంటూ మనసులో అనుకుంటుంది. ఆ తరువాత కార్డు లో ఎదో వసు పై ఇష్టంగా రాసి నెమలి పించాలు ఉన్న కుండీకి టాగ్ చేసి వెళ్ళిపోతుంది.
 

77

ఒకవైపు వసు (Vasu)  నిద్ర లేచి జగతి టాగ్ చేసిన టెక్స్ట్ ని చూసి  చాలా హ్యాపీ గా ఫీల్ అవుతుంది. ఇక జగతి కి కూడా థాంక్స్ చెబుతుంది. ఆ తరువాత జగతి రిషి, వసు ల గురించి ఆలోచిస్తుంది. తరువాయి భాగంలో గౌతమ్ (Gautham) వసు వాళ్ళ ఇంటికి వెళ్లినందుకు రిషి కోపంతో రగిలిపోతాడు.

click me!

Recommended Stories