Guppedantha Manasu: రిషి ముందు దేవయాని నటన! పెద్దమ్మని క్షమాపణలు అడగండి డాడ్ అంటూ రిషి!

First Published Oct 3, 2022, 9:04 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు అక్టోబర్ 3వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..రిషి కాఫీ షాప్ లో వచ్చి కూర్చుంటాడు.అప్పుడు వసు మిగిలిన వాళ్ళకి ఆర్డర్ తీసుకుంటూ ఉంటుంది.రిషి మనసులో,కావాలని లేట్ చేస్తుందా లేకపోతే నిజంగానే లేట్ అవుతుందా అని అనుకుంటాడు. ఇంతలో వసు, ఒక్క నిమిషం సార్ తెచ్చేస్తున్నాను అని చెప్పి కాఫీ ఇస్తుంది. వచ్చి కూర్చొ అని రిషి అనగా, డ్యూటీలో ఉన్నాను సార్ అని వసు అంటుంది. సరే అయితే నేను వెళ్ళిపోతాను అని రిషి అంటాడు. అప్పుడు కూర్చుంటుంది వసు. రిషి వసుతో, నువ్వు ఇది మానేయొచ్చు కదా వసుధార! మంత్రిగారు చెప్పినట్టు సివిల్స్ కి ప్రిపేర్ అవ్వచ్చు కదా.ఖచ్చితంగా పాస్ అవుతావు అని అనగా, ఒద్దు సార్ నేను చిన్నప్పుడు నుంచి ఒకే లక్ష్యంతో ఉన్నాను. పోలీసులు, డాక్టర్లు, ఇంజనీరింగ్ లు వీళ్ళందర్నీ తయారు చేసేది టీచర్లు మాత్రమే. నేను లెక్చరర్ అవుతాను సర్ మీలాగా, జగతి మేడమ్ లాగా. 

దేనికోసమూ మొదటి నుంచి ఉన్నదాన్ని మధ్యలో వదులుకోలేను సార్. ప్రేమించిన ఉద్యోగాన్ని అయినా ప్రేమించడం మనిషినైనా అని అంటుంది. అప్పుడు రిషి మనసులో, నువ్వు వాన్నిట్లోనే బానే ఉంటావు కానీ ఆ ఒక్క విషయం దగ్గర ఎందుకు అలాగా నన్ను అర్ధం చేసుకోవడం లేదు అని అనుకుంటాడు రిషి.అప్పుడు కాలేజ్ కి వస్తున్నావా అని రిషి అనగా, రమ్మంటారా సర్ అని వసు అంటుంది. అప్పుడు రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకు సార్ కి కోపం వచ్చింది? రేపు కాలేజీకి రా వసుధార అని అడగొచ్చు కదా ఆ స్వేచ్ఛ సార్ కి ఉంది కదా అని అనుకుంటుంది వసు. అప్పుడు రిషి, వస్తావా అని అడిగినప్పుడు మీరు రమ్మంటే వస్తాను సార్ అనాలి కాని రమ్మంటారా అని అడగడం ఏంటి అని అనుకుంటాడు.ఆ తర్వాత సీన్లో ధరణి దేవయానికి భోజనం వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడు దేవయాని,ఆ ఆదిదంపతులు ఏరి కిందకి రాలే భోజనానికి అని అనగా,తెలియదు అత్తయ్యగారు అని ధరణి అంటుంది.
 

వాళ్ళు తినడం మానేశారు అని మనం వాళ్ల కోసం ఆగుతామా ఏంటి వడ్డించు అని అంటుంది. అదే సమయంలో రిషి అక్కడికి వస్తాడు. రిషి రావడం చూసిన దేవయాని,నా మీద కోపంతో వాళ్ళిద్దరూ అలిగినట్టున్నారు అని కావాలి రిషికి వినబడేటట్టు అంటుంది.అప్పుడు రిషి అక్కడికి వచ్చి ఏమైంది పెద్దమ్మ అని అనగా, ఇప్పుడు దాని గురించి ఎందుకు రిషి ఇంట్లో మనిషి కదా అని చెప్పి మహేంద్రని ఒక మాట అన్నాను. దానికి మహీంద్రా, వాడు నా కొడుకు అధికారం నాకే ఉంది మీరెవరు మధ్యలో అని అన్నాడు. అయినా నేను ఎవరిని చెప్పు నిన్ను కన్నతల్లినా! కానీ నేను నిన్ను నా సొంత కొడుకులానే చూసుకున్నాను రిషి అని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో జగతి, మహీంద్రాలు అక్కడికి వస్తారు. అప్పుడు రిషి, మహీంద్ర తో,రిషి నా కొడుకు మీకెందుకన్నారా లేదా అని అడుగుతాడు. దానికి మహేంద్ర, పూర్తిగా విను రిషి ఒకవైపు నుంచి ఎందుకు వింటున్నావు ఇంకొక వైపు కూడా వినాలి కదా అని అంటాడు. 

 దానికి రిషి, నాకు ఇంకోవైపు అవసరం లేదు డాడ్ మీరు పెద్దమ్మని ఏ కారణం చేత మాట అన్నా సరే నేను ఊరుకోను. పెద్దమ్మ నా జీవితంలో అతి ముఖ్యమైన మనిషి ఆవిడ బాధపడడానికి వీలులేదు అని అంటాడు. దానికి మహేంద్ర,అసలు ఏం జరిగిందో విను అని అనగా జగతి, మహేంద్ర ని ఆపుతుంది.అప్పుడు రిషి చూసి, ఏంటి మేడం కంట్రోల్లో పెడుతున్నారు అని అనగా, మహేంద్రకి  కోపం వచ్చి, నన్ను ఇంకొకళ్ళు ఎందుకు కంట్రోల్ లో పెడతాడు అని అనుకుంటాడు. అప్పుడు రిషి మహీంద్రా తో, మీరు పెద్దమ్మని ఏ ఉద్దేశంతో అన్నా సరే, పెద్దమ్మకి సారీ చెప్పండి డాడ్ అని అంటాడు. దానికి మహేంద్ర, నేను చెప్పను రిషి నేను తప్పు చేయలేదు అని అనగా, మీరు సారీ చెప్పకపోతే నేను తినను డాడ్ అని చెప్పి కోపంతో పైకి వెళ్ళిపోతున్నప్పుడు రిషి. అప్పుడు మహేంద్ర బలవంతంగా దేవియానికి సారీ చెప్తాడు. రిషి ని తీసుకురండి వదిన గారు, నాకు రిషి ముఖ్యం దానికోసం నేను ఎన్ని మెట్లైనా దిగుతాను అని అంటాడు.

 ఆ మాటలు విన్న దేవయాని మనసులో, నిన్ను ఇంకా కిందకి దిగజార్చుతాను అని అనుకోని రిషి దగ్గరికి వె,ళ్లి నాన్న రిషి, నువ్వు భోజనం చేయకపోతే నేను భోజనం చేయలేను కదా నా కోసమైనా రా!మనందరి మధ్య గొడవలు ఎందుకు అనీ రిషిని కిందకి తీసుకొచ్చి భోజనం పెడుతుంది. అప్పుడు మహేంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు రిషి మహేంద్ర చేయ పట్టుకుని, నామీద కోపం వచ్చిందా డాడ్. మీరు కూడా వచ్చి భోజనం చేయండి మీరు తినకపోతే నేను తినను. మేడం మీరు కూడా వచ్చి భోజనం చేయండి అని జగతిని కూడా కూర్చోబెడతాడు.
 

 అప్పుడు మహేంద్ర  ముఖం డల్ గా పెట్టగా రిషి మహేంద్ర తో, పెద్దమ్మ విషయంలో నేను కఠినంగా ఉంటే నన్ను క్షమించండి డాడ్. కానీ పెద్దమ్మకు గౌరవం పోయేటట్టు ఏ మాట అన్నా నేను సహించలేను అని అంటాడు. అయినా మహేంద్ర డల్ గానే ఉంటాడు. అప్పుడు రిషి జగతితో,మేడం మినిస్టర్ గారు చెప్పినట్టు ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఏ ఏరియాకి వెళ్లాలో లిస్టు వచ్చిందా అని అనగా జగతి కూడా మొఖం డల్ గా పెట్టి, కొన్ని కొన్ని వచ్చాయి రిషి అని చెప్తుంది.అదే సమయంలో దేవయాని వసుధార గురించి మాట్లాడదాము అని, ఆ వసుధారా అని అనేలోగా వసు రిషికి ఫోన్ చేస్తుంది.
 

 అప్పుడు రిషి ఫోన్ ఎత్తి ,ఆ ఫైల్ అన్ని అలాగే చేయు అవి పూర్తయిన తర్వాత నాకు పంపించు అని ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడు రిషి దేవయానితో, చెప్పడం మర్చిపోయాను పెద్దమ్మ మంత్రిగారి దగ్గర నుంచి మిషన్ ఎడ్యుకేషన్ విషయం తరఫున మాతో వసుధార పనిచేస్తుంది.ఈ ప్రాజెక్టులో తను ఉండడం వలన ప్రాజెక్ట్ చాలా తేలికగా అవుతుంది. ఆ స్థానంలో ఇంక ఎవరు ఉన్నా సరే అర్థం చేసుకోవడం చాలా కష్టమైంది అని అనగా దేవయాని ఆశ్చర్య పోతుంది. అప్పుడు మహేంద్ర దేవయాని వైపు గీరగా చూస్తాడు. ఆ తర్వాత సీన్లో వసు ఫోన్ లో రిషి ఫోటో చూస్తూ, ఏంటి సార్ మీరు ఏం మాట్లాడరు. 
 

నేను లొడ లొడ వాగుతూ ఉంటాను మీరు సైలెంట్ గా ఉంటారు మనిద్దరికీ బాగా సరిపోయింది సార్ అని అనుకుంటుంది. అదే సమయంలో రిషి కూడా వసు ఫోటో చూస్తూ, ఫోన్ చేయొచ్చు కదా అని అనుకుంటాడు. మరోవైపు వసు, అయినా ప్రతి ప్రేమికులు గంటకోసారి మాట్లాడుకుంటారు. మనం మాట్లాడుకునే ప్రతిసారి గొడవలే అవుతాయి ఇంక మనకి ప్రేమగా మాట్లాడే సమయం ఎక్కడ ఉంటుంది అయినా ఇది కూడా బానే ఉంది. కనీసం ఫోన్ చేయకపోయినా ఒక మెసేజ్ అయినా పెట్టొచ్చు కదా సర్, వసుధారా ఏం చేస్తున్నావు?, భోజనం చేసావా అని అయినా అడగొచ్చు కదా అని అనుకుంటుంది.అదే సమయంలో రిషి ,ఇప్పుడు ఫోన్ చేసి ఏం మాట్లాడుతాను? భోజనం చేసావా, తిన్నావా, పడుకున్నావా, తర్వాత బాయ్ అంతే కదా జరుగుతుంది అని అనుకుంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!