
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. కార్తీక్, దీప దగ్గరికి వచ్చి, ఏదోలా ఉంది వంటలక్క ఆని అంటాడు. ఏమైంది డాక్టర్ బాబు నాతో మీరు భయపడకుండా ఏమైనా చెప్పొచ్చు అని దీప అంటుంది. కార్తీక్ విషయం చెప్పేలోగా శివ అక్కడికి వస్తాడు. సార్ మనం బయటికి వెళ్దాము అని అంటాడు. ఎందుకు అని కార్తీక్ అడగగా, మేడం మనల్ని ఒక రెండు గంటలు బయట తిరగమన్నారు సార్ అని అంటాడు. కార్తీక్ ఆశ్చర్యపోతాడు. అదే సమయంలో దుర్గా శివకి ఫోన్ చేస్తాడు. ఫోన్ అయిపోయిన తర్వాత ఎవరు చేసారు అని కార్తీక్ అనగా, మన ఇంటికి వచ్చారు కదా సార్, ఆయన నన్ను ఒక రెండు గంటలు సినిమాకి వెళ్ళమని డబ్బులు పంపించారు.
చాలా తెలివిగా మిమ్మల్ని, నన్ను బయటకి పంపిస్తున్నారు సార్ అక్కడ ఏం జరుగుతుందో అని చెప్పి శివా అనుకొని అలా సినిమాకి వెళ్ళిపోతాడు. అప్పుడు కార్తీక్ అలా ఉండిపోతాడు. దీప కూర్చొని డాక్టర్ బాబు అని మంచినీళ్లు తెచ్చి, ఆవేశపడొద్దు డాక్టర్ బాబు ప్రశాంతంగా ఉండండి అంటుంది. అప్పుడు కార్తీక్, ఇంత జరిగినా ఎలా ప్రశాంతంగా ఉంటాను ఇంతకుముందు కూడా ఇలాగే ఉండేదా? గతం మర్చిపోయి నేనే హాయిగా ఉన్నానా? నవ్వుల పాలు అయిపోతుంది నా జీవితం అని అనుకుంటాడు. మరోవైపు దుర్గా హాయిగా చాప వేసుకుని ఇంటి బయట నక్షత్రాలు చూస్తూ పడుకుంటాడు.
ఇంతలో మోనిత అక్కడికి వచ్చి, ఒక పెద్ద రాడ్ తో దుర్గని కొట్టాలనుకుంటుంది కానీ దుర్గా అప్పటికే చూసేస్తాడు. ఏంటి మోనిత చంపేద్దాం అనుకుంటున్నావా! ఇప్పుడు నువ్వు నన్ను చంపేస్తే మనిద్దరి మధ్య ఏదో ఉందని కార్తీక్ సార్ కి నువ్వే ప్రూవ్ చేసినట్టు ఉంటుంది. అందరూ మన ఇద్దరి మధ్య ఏదో జరిగిందని అనుకుంటారు అని అంటాడు. దానికి మోనిత, కర్ర అక్కడ పారేసి, లేదు నేను ఊరికనే తీశాను అని అంటుంది. అప్పుడు దుర్గ,అంతేలే మనకు మనుషులని పైకి పంపించడం కొత్తేమీ కాదు కదా అని అంటాడు. ఇంతలో దుర్గ, రా పక్కకి వచ్చి కూర్చో అలా నక్షత్రాలు చూద్దాము అని అనగా, నువ్వు నాకు చుక్కలు చూపిస్తున్నావు కదా!.
అసలు మీ ఇద్దరికీ ఏం కావాలి?ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నారు అని అంతుంది. అప్పుడు దుర్గా, అదంతా కాదు కానీ కార్తీక్ సర్ ఏరీ అని అడుగుతాడు దుర్గ. శివతో బయటికి పంపాను. ఎందుకు ఇంకా అనుమానం పెంచుదాం అనుకుంటున్నావా అని మోనిత అనగా దుర్గ, నేను అనుమానం క్రియేట్ చేయాలనుకోలేదు నువ్వే క్రియేట్ చేశావు ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నువ్వే చూసుకో అని అంటాడు. ఎక్కడ ఏం జరుగుతుంది అని మోనిత అనగా, సారు బయటికి వెళ్ళలేదు వంటలక్క ఇంటికెళ్లారు అని అనగా మోనిత,అక్కడికి వెళ్లి వెనకాతల నుంచి దీప కార్తిక్ ల మాటలు వింటుంది.
అప్పుడు కార్తీక్ దీపతో, మోనిత నన్ను మోసం చేసింది అనుకోలేదు.నేను అందరి ముందు నవ్వులపాలు అయిపోతున్నాను అసలు తన అంత తప్పు ఎలా చేయగలదు అని అనగా,నేనేం తప్పు చేశాను నా మీద మళ్ళీ లేనిపోని ఏవైనా ఇది చెప్తుందా అని మోనిత అనుకుంటుంది. అంతలో కార్తీక్, అయినా మమ్మల్ని బయటకు పంపి తను ఏం చేద్దాం అనుకుంటుంది అని అనగా, నేనెప్పుడూ పంపినట్టే పంపాను కదా అందులో తప్పేముంది అని మోనిత అనుకుంటుంది. అప్పుడు కార్తీక్ దీపతో, అయినా ఆ దుర్గా శివ కి ఫోన్ చేసి రెండు గంటల వరకు ఇంటికి రావద్దన్నాడు అంటే దానికి నేనేం అర్థం చేసుకోవాలి అని కార్తీక్ అరుస్తాడు.
ఈ మాటలు విన్న మోనిత ఆశ్చర్యపోయి కోపంతో శివ దగ్గరికి వెళ్లి రాడ్డుతో కొట్టాలి అనుకుంటుంది. కానీ శివ అన్న మాటలు గుర్తొచ్చి ఎక్కడ తన మీద కేసు అవుతుందో అని కర్ర పక్కన పారేసి ఇంజక్షన్ తెస్తుంది.ఇప్పుడు దీంతోని వీడి గొడవ వదిలిపోతుంది అని మనసులో అనుకొని దుర్గ పడుకున్నప్పుడు దుప్పటి తీసి చేతిని ముట్టుకున్న సమయంలో వెనకాతల నుంచి కార్తీక్,దీప లు అక్కడికి వస్తారు. ఇదంతా నా అపోహ అన్నావు కదా వంటలక్క. ఇక్కడ చూడు ఏం జరుగుతుందో అని కార్తీక్ అనగా, ఆ మాటలు విన్న మోనిత ఇంజక్షన్ పక్కన పడేసి లేపి టెన్షన్ గా ఉంటుంది.సరైన సమయంలో దొరికిపోయాను అని అనుకుంటుంది మోనిత. అప్పుడు దీప నవ్వుతుంది. నువ్వు నవ్వద్దు అని దీపతో మోనిత అన్నప్పుడు కార్తీక్, నువ్వు నవ్వు వంటలక్క. నా జీవితమే ఇక్కడ నవ్వులపాలు అయిపోయింది అని అంటాడు.
అప్పుడు మోనిత కార్తీక్ తో,అప్పుడే వచ్చేసావ్ ఎందుకు కార్తీక్ అని అనగా, ఇంకో రెండు గంటలు ఆగి రానా నీకు ఇబ్బందిగా ఉన్నట్టుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మోనిత, మీ ఇద్దరికీ అసలు ఏం కావాలి? ఎందుకు నన్ను,కార్తీక్ ని విడగొట్టాలనుకుంటున్నారు? కార్తీక్ దృష్టిలో నన్ను ఎందుకు అంత చెడ్డగా చేశారు అని అంటుంది.అప్పుడు దీప,ఇప్పుడే నువ్వు ఇలాగ అయిపోతుంటే పదేళ్లు క్రితం విహారితో నాకు ఏదో సంబంధం ఉన్నదని చెప్పి డాక్టర్ బాబుని పదేళ్లపాటు నమ్మించావు. పదేళ్లు నేను పడిన నరకయాతన ఇప్పుడు నీకు కూడా పడాలి కదా. అయినా దీనికే ఇలాగా అయిపోతున్నావు ఇది ఒకరోజు మాత్రమే అని అనగా, మోనిత, మీరు ఏం చేసినా నేను కార్తీక్ ని వదలను ఎలాగైనా కార్తీక్ నాతోనే ఉంటాడు అని అంటుంది. దానికి దీప, నువ్వు డాక్టర్ బాబుని వదిలేయడం కాదు, డాక్టర్ బాబాయ్ ఏ నిన్ను వదిలేస్తారు అని అంటుంది.
అప్పుడు దుర్గ, వెళ్లు మోనిత, లేకపోతే ఇంతవరకు ఇక్కడ ఏం చేసావో అని మళ్లీ అనుమానించుకుంటారు అని అంటాడు. అప్పుడు మోనిత పరిగెట్టి కార్తీక్ దగ్గరికి వెళ్తుంది. అప్పటికే కార్తీక్ ఆనంద్ ని పట్టుకొని పడుకోబెడుతూ ఉంటాడు. అప్పుడు మోనిత అక్కడికి వస్తుంది. కార్తీక్ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు. ఇప్పుడు నేను జరిగిన విషయం అంతా చెప్పాలా?ఒకవేళ జరిగిన విషయం చెప్తే నేను ఎందుకు సైలెంట్ గా ఉన్నాను అని కార్తీక్ అడుగుతాడు. దానికి నేను సమాధానం ఇవ్వలేను ఏం చేయాలి అని అనుకుంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!