మహేష్‌-త్రివిక్రమ్‌ సినిమా ఓటీటీ రైట్స్.. షూటింగే కాలేదు అప్పుడే.. పాన్‌ ఇండియాపై క్లారిటీ.. ఇదెక్కడి క్రేజ్‌

Published : Jan 14, 2023, 08:53 PM IST

సూపర్‌ స్టార్‌ మహేష్‌ తన జోరు చూపిస్తున్నారు. తన నెక్ట్స్ సినిమా `ఎస్‌ఎస్‌ఎంబీ28` రూపంలో తన సత్తాని చూపిస్తున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కావడంతో దీనిపై విపరీతమైన క్రేజ్‌ నెలకొంది.   

PREV
15
మహేష్‌-త్రివిక్రమ్‌ సినిమా ఓటీటీ రైట్స్.. షూటింగే కాలేదు అప్పుడే.. పాన్‌ ఇండియాపై క్లారిటీ.. ఇదెక్కడి క్రేజ్‌

మహేష్‌ బాబు(Mahesh) నటిస్తున్న లేటెస్ట్ మూవీ `ఎస్‌ఎస్‌ఎంబీ28`(SSMB28). ఈ సినిమా గతేడాది సెప్టెంబర్‌లో ప్రారంభమైంది. ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. కానీ మహేష్‌ ఇంట్లో వరుస మరణాల నేపథ్యంలో ఆగుతూ వస్తోంది. తల్లి ఇందిరా దేవి, ఆ తర్వాత సూపర్‌ స్టార్‌ కృష్ణ హఠాన్మరణం చెందారు. దీంతో పుట్టెడు దుఖంతో ఉన్నారు మహేష్‌. బ్యాక్‌ టూ బ్యాక్‌ తల్లితండ్రి చనిపోవడంతో పెద్ద షాక్‌లోకి వెళ్లిపోయారు. దాన్నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు మహేష్‌. 
 

25

ఇక త్రివిక్రమ్‌(Trivikram) దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి సంబంధించి తాజాగా పలు క్రేజీ అప్‌డేట్‌ బయటకు వచ్చాయి. ఈ సినిమా ఈ నెల 18న నుంచి తిరిగి షూటింగ్‌ జరుపుకోబోతుంది. దాదాపు రెండు నెలల పాటు నిరంతరాయంగా చిత్రీకరించబోతున్నారట. మహేష్‌ బల్క్ గా ఈ సినిమాకి డేట్స్ కేటాయించారు. ఇప్పటికే షూటింగ్‌ చాలా ఆలస్యం అయిన నేపథ్యంలో బ్రేక్‌ లేకుండా కొట్టేయాలని భావిస్తున్నారట. అందుకే భారీ షెడ్యూల్‌ని ప్లాన్‌ చేసినట్టు తెలుస్తుంది. హైదరాబాద్‌ పరిసరాల్లో ప్రత్యేకంగా రెండు సెట్లు కూడా వేయించినట్టు సమాచారం. 
 

35

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి మరో అప్‌డేట్‌ ట్రెండ్‌ అవుతుంది. ఈ సినిమా షూటింగ్‌ కూడా కంప్లీట్ కాలేదు, అప్పుడే ఓటీటీ రైట్స్ అమ్ముడు పోవడం విశేషం. నెట్‌ ఫ్లిక్స్ `ఎస్‌ఎస్‌ఎంబీ28` ఓటీటీ రైట్స్ ని దక్కించుకుందట. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇలా మొత్తంగా ఐదు భాషలకు సంబంధించిన రైట్స్ ని నెట్‌ ఫిక్స్ దక్కించుకోవడం విశేషం. భారీ రేట్‌కి ఈ డిజిటల్‌ హక్కులు సొంతం చేసుకున్నట్టు సమాచారం. దీంతోపాటు చిరంజీవి, రవితేజ, నాని సినిమాల రైట్స్ కూడా సొంతం చేసుకుంది నెట్‌ ఫ్లిక్స్.
 

45

ఇదిలా ఉంటే ఈ సందర్భంగా మహేష్‌ ఫ్యాన్స్ కి గూస్‌ బంమ్స్ తెప్పించే అప్‌డేట్‌ కూడా తెలిసిపోయింది. ఈ సినిమాని పాన్‌ ఇండియా రేంజ్‌లో తీస్తున్నారనే విషయాన్ని కన్ఫమ్‌ చేశారు. ఐదు భాషల్లో ఓటీటీ రైట్స్ దక్కించుకుందంటే ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతుందనే విషయం తెలిసిపోతుంది. ఇది మహేష్‌కి మొదటి పాన్‌ ఇండియా మూవీ కావడం విశేషం. దీంతోసూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సంక్రాంతి పండక్కి అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చారంటూ వాళ్లు హ్యాపీగా ఫీలవుతున్నారు. 
 

55

ఇక ఈసినిమాపై ఎన్ని అంచనాలు పెట్టుకున్నా, దాన్ని మించి ఉంటుందని చెప్పారు నిర్మాత నాగవంశీ. అంతేకాదు ఇందులో ఐటెమ్‌ సాంగ్‌ని కూడా పెట్టబోతున్నారట. త్రివిక్రమ్‌ సినిమాల్లో మొదటిసారి ఐటెమ్‌ సాంగ్‌ జోడించబోతున్నారని సమాచారం. అందుకు రష్మికతో టాక్స్ జరిగాయని సమాచారం. ఇక మెయిన్‌ హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తుంది. సెకండ్‌ హీరోయిన్‌గా శ్రీలీలా కనిపించబోతుంది. హరికా అండ్‌ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలోగానీ, లేదంటే వచ్చే ఏడాదిగానీ రిలీజ్‌ కానుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories