SSMB28: త్రివిక్రమ్‌ సినిమా షూటింగ్‌ని మధ్యలోనే ఆపేసిన మహేష్‌.. కారణం ఇదేనా? నిజం ఏంటంటే?

Published : Sep 21, 2022, 02:37 PM ISTUpdated : Sep 21, 2022, 02:41 PM IST

సూపర్‌ స్టార్‌ మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో చాలా గ్యాప్‌తో సినిమా వస్తోన్న నేపథ్యంలో భారీ అంచనాలున్నాయి. కానీ ఆదిలోనే దీనికి హంసపాదులా షూటింగ్‌కి బ్రేక్ పడటం ఆశ్చర్యపరుస్తుంది.   

PREV
16
SSMB28: త్రివిక్రమ్‌ సినిమా షూటింగ్‌ని మధ్యలోనే ఆపేసిన మహేష్‌.. కారణం ఇదేనా? నిజం ఏంటంటే?

దాదాపు 12ఏళ్ల గ్యాప్‌ తర్వాత మహేష్‌-త్రివిక్రమ్‌ కలిసి నటిస్తున్నారు. మొదట `అతడు` చిత్రంతో ఈ కాంబినేషన్‌ సెట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా థియేటర్లో మామూలుగానే ఆడినా, టీవీలో మాత్రం రికార్డ్ టీఆర్‌పీ రేటింగ్ సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉంది. ఆ తర్వాత `ఖలేజా`తో కలిసినా అది బాక్సాఫీసు వద్ద బెడిసికొట్టింది. దీంతో మళ్లీ కలవలేదు. ఇన్నాళ్లకి ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నారు. 

26

మహేష్‌ నటిస్తున్న 28వ చిత్రమిది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ గత వారమే ప్రారంభమైంది. చాలా రోజుల వెయిటింగ్‌ అనంతరం యాక్షన్‌ సీక్వెన్స్ తో షూటింగ్‌ని ప్రారంభించారు. `కేజీఎఫ్‌` ఫైట్‌ మాస్టర్స్ అన్బరివ్‌(Anbumani & Arivumani) సారథ్యంలో భారీ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ ఫైట్‌ సీన్లు చిత్రీకరించారు. రాత్రి సమయాల్లోనే ఈ షూటింగ్‌ జరిగిందని తెలుస్తుంది. 
 

36

అయితే లేటెస్ట్ సమాచారం మేరకు సినిమా షూటింగ్‌ మధ్యలోనే ఆపేశారని టాక్‌. మొదటి షెడ్యూల్‌ పూర్తయ్యిందని, కొన్ని రోజుల గ్యాప్‌ తర్వాత మరో షెడ్యూల్‌ని ప్రారంభించబోతున్నారని, మిగిలిన యాక్షన్‌ సీక్వెన్స్ ని చిత్రీకరించబోతున్నట్టు తెలుస్తుంది. దసరా తర్వాతే మళ్లీ షూటింగ్‌ ఉంటుందట.
 

46

`ssmb28` షూటింగ్‌కి సంబంధించి మరో వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. యాక్షన్‌ సీక్వెన్స్ విషయంలో మహేష్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ సంతృప్తిగా లేరట. అనుకున్న విధంగా ఈ ఫైట్‌ సీన్లు రావడం లేదని, అందుకే షూటింగ్‌ని మధ్యలోనే ఆపేసినట్టు తెలుస్తుంది. నిజానికి ఈ షెడ్యూల్‌ ఈ నెలాఖరు వరకు కంటిన్యూగా జరగాల్సి ఉంది. ఆ తర్వాత దసరా పండుగ బ్రేక్‌ తీసుకుని మళ్లీ రెండో షెడ్యూల్‌ని చేయాలనుకున్నారు. కానీ రెండు రోజులే చిత్రీకరించి అప్పుడే షూటింగ్ ఆపేయడంతో అనుమానాలు ఊపందుకున్నాయి. దీంతో కొత్త విషయం బయటకు వస్తుంది. 

56

అయితే ఈ ఫైట్‌ సీన్లు.. మరో ఫైట్‌ మాస్టర్స్ తో చేయించాలా? అనే చర్చలు జరుగుతున్నాయట. `కేజీఎఫ్‌` ఫైట్‌ మాస్టర్స్ ని పక్కన పెట్టి వేరే పాపులర్‌ ఫైట్‌ మాస్టర్స్ ని తీసుకోవాలనే ఆలోచనలో త్రివిక్రమ్‌ ఉన్నట్టు ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అంతేకాదు మరోసారి `కేజీఎఫ్‌` ఫైట్‌ మాస్టర్లే ఛాన్స్ ఇవ్వాలని, అప్పుడు కూడా సరిగా రాకపోతే యాక్షన్‌ కొరియోగ్రాఫర్లని మార్చాలని భావిస్తున్నట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఇప్పుడీ వార్త సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

66

ఇదిలా ఉంటే మహేష్‌-త్రివిక్రమ్‌ సినిమా మొదటి షెడ్యూల్‌ పూర్తయినట్టు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. భారీ ఎపిక్‌ యాక్షన్‌ సీక్వెన్స్ ని అన్బరివ్‌ ఫైట్‌ మాస్టర్స్ సారథ్యంలో విజయవంతంగా పూర్తి చేశామని, ఇంతటి అద్భుతమైన ఫైట్‌సీన్లు కంపోజ్‌ చేసిన మాస్టర్స్ కి ఈ సందర్భంగా యూనిట్ థ్యాంక్స్ చెప్పారు. సెకండ్‌ షెడ్యూల్‌ దసరా తర్వాతే ప్రారంభమవుతుందని, ఇందులో మహేష్‌తోపాటు పూజా హెగ్డే పాల్గొనబోతుందని తెలిపింది యూనిట్‌.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories