ఫ్యామిలీ హీరోయిన్ గానూ సదా మెప్పించింది. టాలీవుడ్ లోని యంగ్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ‘జయం, ప్రాణం, నాగ, అపరిచితుడు, అవున్నా కాదన్నా, చుక్కల్లో చంద్రుడు, టక్కరి’ చిత్రాలు ఆమెను మరోస్థాయికి తీసుకెళ్లాయి. ఇప్పటికీ సదా నటించిన ‘అపరిచితుడు’ సినిమాను అభిమానులు ఇష్టపడుతారు.