మహేష్‌ ఫ్యాన్‌కి గుడ్‌ న్యూస్‌ః ముద్దుల తనయ సితార గ్రాండ్‌ సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ.. ఏకంగా దళపతి చిత్రంలో ?

Published : Oct 06, 2021, 08:52 PM IST

మహేష్‌బాబు బాలనటుడిగా కెరీర్‌ని ప్రారంభించి ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ గా ఎదిగారు. ఇప్పుడు ఆయన ముద్దుల తనయ సితార కూడా సినీ రంగ ప్రవేశానికి సర్వం సిద్ధమైందట. మరో సూపర్‌ స్టార్‌ చిత్రంలో సితార నటించబోతుందని తెలుస్తుంది.   

PREV
16
మహేష్‌ ఫ్యాన్‌కి గుడ్‌ న్యూస్‌ః ముద్దుల తనయ సితార గ్రాండ్‌ సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ.. ఏకంగా దళపతి చిత్రంలో ?

సితార ఘట్టమనేని సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమెకి సపరేట్‌గా ఇన్‌స్టా అకౌంట్‌ కూడా ఉంది. అందులో తనకు సంబంధించిన అప్‌డేట్లు పెడుతూ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది సితార. ప్రస్తుతం ఆమెకి ఇన్స్టాలో నాలుగున్నర లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. 
 

26

మరోవైపు స్టడీస్‌కి సంబంధించి, ఫన్నీ వీడియోలను సైతం చేస్తూ యూట్యూబ్‌ ఛానెల్‌ని మెయింటేన్‌ చేస్తుంది సితార. దర్శకుడు వంశీపైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి ఇప్పటికే అనేక వీడియోలు చేశారు. వారిద్దరు మంచి ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే. మహేష్‌కి, దర్శకుడు వంశీపైడిపల్లికి మంచి అనుబంధం ఉంది. ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా కలిసిపోతుంటారు. అలాగే వారి కూతుళ్లు కూడా ఫ్రెండ్స్ అయ్యారు. 

36

ఇదే ఇప్పుడు సితారని సినిమా ఎంట్రీ ఇచ్చేందుకు కారణమైంది. వంశీపైడిపల్లి తమిళ స్టార్‌, దళపతి విజయ్‌తో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఇటీవలే ప్రకటించారు. విజయ్‌ 66వ చిత్రంగా ఇది రూపొందనుంది. దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, తమిళంలో బైలింగ్వల్‌గా, పాన్‌ ఇండియా చిత్రంగా దీన్ని రూపొందించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. 
 

46

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో బాలనటిగా సితార ఎంట్రీ ఇవ్వబోతుందట. మహేష్‌ ఫ్యామిలీతో తనకున్న అనుబంధంతో, సినిమాలో బాలనటి పాత్ర కీలకంగా ఉండటంతో,పైగా సితార చాలా బాగా యాక్టివ్‌గా ఉండటంతో
ఆమెని విజయ్‌ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్‌ చేస్తున్నారట. అందుకు మహేష్‌, నమ్రత వైపు నుంచి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ దొరికిందని సమాచారం. 

56

ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ సినిమాలో విజయ్‌ డాటర్‌గా సితార కనిపించబోతుందని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. సితార ఇప్పటికే హాలీవుడ్‌
యానిమేషన్‌ చిత్రం `ఫ్రోజెన్‌2`లో చైల్డ్ ఎల్సా పాత్రకి తెలుగులో డబ్బింగ్‌ చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ఆర్టిస్టుగానే సిల్వర్‌ స్క్రీన్‌కి పరిచయం కాబోతుందని చెప్పొచ్చు. 

66

ఇదిలా ఉంటే మరో హీరో, స్టయిలీష్ స్టార్‌ అల్లు అర్జున్‌ తనయ అర్హ ఇటీవలే సినీ రంగ ప్రవేశం చేసింది. ఆమె గుణశేఖర్‌ దర్శకత్వంలో సమంత ముఖ్యం పాత్ర పోషిస్తున్న `శాకుంతలం` చిత్రంలో నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్‌ కూడా పూర్తి చేసుకుంది. ఇందులో అర్హ మాస్టర్‌ భరత పాత్రలో కనిపించబోతుంది. ఇలా ఒక్కొక్కరుగా తారల వారసులు సినీ ఎంట్రీ ఇవ్వబోతుండటం విశేషం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories