'మా' అసోసియేషన్ ఎన్నికకు ఇక కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. దీనితో ప్రకాష్ రాజ్ ప్యానల్, విష్ణు ప్యానల్ ప్రచార జోరు పెంచాయి. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. ప్రకాష్ రాజ్, విష్ణు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. గత రెండు రోజులుగా వీరిద్దరి మధ్య విమర్శల తీవ్రత పెరిగింది. విష్ణు ప్యానల్ సభ్యులు ప్రకాష్ రాజ్ స్థానికతని ప్రశ్నిస్తున్నారు. ఇక ప్రకాష్ రాజ్.. మా సభ్యులని విష్ణు డబ్బుతో ప్రలోభ పెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు సంచలన ఆరోపణలు చేశారు.