మహేష్‌, నమ్రత, సితార, గౌతమ్‌.. గోవా ట్రిప్పేసిన సూపర్‌స్టార్‌ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్‌

Published : Aug 14, 2021, 12:59 PM IST

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఫ్యామిలీ వెకేషన్‌కి గోవాకి వెళ్తున్నారు. తన భార్య, నటి నమ్రత, పిల్లలు గౌతమ్‌, సితారలతోపాటు క్లోజ్డ్ రిలేటివ్‌తో కలిసి మహేష్‌ హాలీడేస్‌కి వెళ్తున్నారు. తాజాగా ఫ్లైట్‌లో జర్నీ చేస్తూ దిగిన ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. 

PREV
18
మహేష్‌, నమ్రత, సితార, గౌతమ్‌.. గోవా ట్రిప్పేసిన సూపర్‌స్టార్‌ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్‌

స్పెషల్‌ ఫ్లైట్‌లో మహేష్‌ గోవా ట్రిప్‌ వెళ్తున్నారు. ఈ విషయాన్ని సితార ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఫోటోలను పంచుకుంటూ వెల్లడించింది. `నాన్నతో ఫ్లైట్‌ జర్నీ ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. మీరు కొన్ని గొప్ప కేక్‌, అద్భుతమైన గూడీస్ని పొందవచ్చు ఈ చిన్న ఫ్లైట్‌లో` అని పేర్కొంది సితార. అన్నయ్యతో కలిసి దిగిన ఫోటోని పంచుకుంది సితార.
 

28

ఇందులో మహేష్‌ ఫ్రంట్‌లో ఉండగా, సైడ్‌లో గౌతమ్‌, సితార, వారి బంధువుల పిల్లలున్నారు. వెనకాల నమ్రత, మరో మహిళ ఉన్నారు. 

38

ఇదిలా ఉంటే మహేష్‌ గోవా ట్రిప్‌ వెళ్లడానికి కారణం ప్రస్తుతం ఆయన నటిస్తున్న `సర్కారు వారి పాట` చిత్రం గోవాలో చిత్రీకరణ జరుపుకోవడమే. గోవాలో యాక్షన్ సీక్వెన్స్ ని షూట్‌ చేసేందుకు దర్శకుడు పరశురామ్‌ ప్లాన్‌ చేశారు. రామ్‌-లక్ష్మణ్‌ మాస్టర్లు ఫైట్స్ సీన్స్ కంపోజ్‌ చేస్తున్నారు. 

48

ఇది గోవా షెడ్యూల్‌ కావడంతో పనిలో పని ఫ్యామిలీ వెకేషన్‌ కూడా పూర్తి చేసుకుని రావచ్చని మహేష్‌ భావించారట. దీంతో ఫ్యామిలీతో కలిసి వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకున్నారు. ఈ జర్నీ పిక్స్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

58

మహేష్‌ ప్రస్తుతం నటిస్తున్న `సర్కారు వారి పాట` చిత్రానికి పరశురామ్‌ దర్శకత్వం వహిస్తుండగా, ఇందులో మహేష్‌ సరసన కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. వీరిద్దరు జోడీగా నటించడం ఇదే ఫస్ట్ టైమ్‌. 

68

రోవైపు ఇటీవల మహేష్‌ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌ విశేషంగా ఆకట్టుకుంది. యాక్షన్‌ సన్నివేశాలు, ఫ్యామిలీ సీన్లు, రొమాంటిక్‌ సీన్లతో హోల్‌సమ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌ అనే విషయాన్ని క్లారిటీ ఇచ్చారు. ఈ టీజర్‌ మిలియన్స్ వ్యూవర్స్ తో దూసుకుపోతుంది. 

78

ఇక మైత్రీ మూవీ మేకర్స్, 14రీల్స్ ప్లస్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి జనవరి 13న విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

88

సంక్రాంతి బరిలో పవన్‌-రానా, ప్రభాస్‌ `రాధేశ్యామ్‌`లతో సినిమా పోటీపడబోతుంది.  దీంతోపాటు త్వరలోనే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందే చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు మహేష్‌. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories