నా పెదాలపై కామెంట్‌ చేశాడు, బిగ్‌ బాస్‌ నటి ప్రియాంక జైన్‌ కామెంట్స్ వైరల్‌, ప్రియుడితో పెళ్లి ఎప్పుడంటే

Published : May 27, 2025, 06:17 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 7వ సీజన్‌ కంటెస్టెంట్‌ ప్రియాంక జైన్‌ తాజాగా తన ప్రియుడి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన పెదాలపై చేసిన కామెంట్లని బయటపెట్టింది.

PREV
16
బిగ్‌ బాస్‌ తెలుగు 7 షోతో ప్రియాంక జైన్‌ పాపులర్‌

`బిగ్‌ బాస్‌ తెలుగు 7వ సీజన్‌లో సందడి చేసింది సీరియల్‌ నటి ప్రియాంక జైన్‌. ఈ షోలో తనదైన స్టయిల్‌లో రచ్చ చేసి ఏకంగా టాప్ 5 కంటెస్టెంట్‌గా నిలిచింది. ఓ వైపు గేమ్స్ లో అంతే యాక్టివ్‌గా పాల్గొంటూ, మరోవైపు ఎంటర్‌టైన్‌ చేయడంలోనూ ముందు ఉంటూ ఆకట్టుకుంది. పల్లవి ప్రశాంత్‌, శివాజీల బ్యాచ్‌ని బలంగా ఎదుర్కొని నిలబడింది.

26
సీరియల్‌ నటిగా ప్రియాంక జైన్ కి గుర్తింపు

ప్రియాంక జైన్‌ అంతకు ముందే సీరియల్స్ ద్వారా బుల్లితెరపై బాగా పాపులర్‌. ఆమె `మౌనరాగం`, `జానకి కలగనలేదు` వంటి సీరియల్స్ లో నటించి ఆకట్టుకుంది. బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. 

వీటితోపాటు ఇప్పుడు `కిర్రాక్‌ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్`, `డాన్స్ ఐకాన్‌` వంటి షోస్‌లోనూ పాల్గొంటుంది. ఈ క్రమంలో తాజాగా బిగ్‌ టీవీ కిస్సిక్‌ టాక్‌ షోలో పాల్గొంది. ఇందులో ఆసక్తికర విషయాలను పంచుకుంది ప్రియాంక.

36
ప్రియుడు శివ కుమార్‌ గురించి ప్రియాంక కామెంట్స్

తన పెదాలపై ప్రియుడు శివకుమార్‌ చేసిన కామెంట్ ని వెల్లడించారు. జబర్దస్త్ వర్ష హోస్ట్ గా ఈ టాక్‌ షో రన్‌ అవుతుంది. ఇందులో పాల్గొన్న ప్రియాంక జైన్‌ మాట్లాడుతూ అబ్బాయిలు తన జీవితంలోకి రావాలంటే ఎలాంటి క్వాలిటీస్‌ ఉండాలనే ప్రశ్నకి స్పందించింది. 

శివకుమార్‌ లాంటి క్యారెక్టర్‌ ఉండాలని చెప్పింది. అంతేకాదు ఈ షోలోనే ప్రియుడు శివకుమార్‌కి ఫోన్‌ చేసి లవ్‌ ప్రపోజ్‌ చేసింది. వీరిద్దరు చాలా రోజులుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. బిగ్‌ బాస్‌ షోలోనూ ఈ విషయాన్ని వెల్లడించారు.

46
శివ కుమార్‌ నా పెదాలు బాగున్నాయన్నాడు

శివకుమార్‌ తనపై చేసిన కామెంట్ గురించి ఓపెన్‌ అయ్యింది ప్రియాంక జైన్‌. క్యాండిలైట్‌ డిన్నర్‌ అంటే తనకు ఇష్టమని, ఎప్పట్నుంచో ఆ కోరిక ఉందని, బ్లాక్‌ డ్రెస్‌లో అలాంటి డిన్నర్‌ చేస్తే బాగుంటుందని తెలిపింది. అంతేకాదు బ్లాక్ డ్రెస్‌లో డిన్నర్‌ కి వెళ్లినప్పుడు తన పెదాలు బాగున్నాయని శివ కామెంట్‌ చేశాడని, అంతకు మించి తమ మధ్య ఏం జరగలేదని తెలిపింది ప్రియాంక జైన్‌.

56
శివ కుమార్‌తో మా పెళ్లి అప్పుడే

ఈ షోలో తమ పెళ్లి పై క్లారిటీ ఇచ్చింది ప్రియాంక. తొందరల్లోనే జరుగుతుందని చెప్పింది. ఈ ఏడాదిలోనే మ్యారేజ్‌ చేసుకోవాలని ప్లాన్‌ చేస్తున్నట్టు వెల్లడించింది. పెళ్లి మాత్రం మామూలుగా ఉండదని, ఓ రేంజ్‌లో ప్లాన్‌ చేస్తున్నట్టు తెలిపింది.  శివకుమార్‌ కూడా టీవీ నటుడు. ఆయన పలు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

66
అమ్మాయిల డ్రెస్‌ ను బట్టి వారిని జడ్జ్ చేయకూడదు

ఇటీవల ఓ షోలో తాను వేసుకున్న డ్రెస్‌ పై విమర్శలు వచ్చాయి. దీనిపై ప్రియాంక జైన్‌ స్పందిస్తూ, ఆ కామెంట్లు తనకు అసహ్యంగా అనిపించాయని, ఆ కామెంట్లని తాను ఎందుకు చూశానో అని బాధపడినట్టు తెలిపింది. 

తాను ఒక షోలో ఆ డ్రెస్‌ వేసుకున్నానని, కానీ ఆ డ్రెస్‌ వేసుకొని మాల్‌లో బహిరంగంగా తిరగలేదని తెలిపింది. మహిళలు ఎలాంటి డ్రెస్‌ వేసుకున్న ఇలాంటి కామెంట్లు చేయడం మానేయాలని, అమ్మాయిలు వేసుకునే డ్రెస్సులు బట్టి వారిని జడ్జ్ చేయడం సరికాదని అని తెలిపింది ప్రియాంక జైన్‌. ఇప్పుడు ఆమె కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories