మహేష్ బాబు-నమ్రత టాలీవుడ్ లవ్లీ కపుల్ గా ఉన్నారు. చాలా మంది భార్యాభర్తలకు వీరు ఆదర్శం అని చెప్పొచ్చు. రెండు దశాబ్దాల వైవాహిక బంధంలో మనస్పర్థలు వచ్చిన దాఖలాలు లేవు. ఒక్క నెగిటివ్ వార్త వినిపించలేదు. వంశీ మూవీ సెట్స్ లో కలిసిన ఈ జంట ప్రేమలో పడ్డారు.
27
దాదాపు 5 ఏళ్ళు నమ్రత-మహేష్ బాబు రహస్యంగా ప్రేమించుకున్నారు. అప్పట్లో సోషల్ మీడియా లేదు. దాంతో నమ్రత-మహేష్ బాబుల లవ్ ఎఫైర్ బయటకు పొక్కలేదు. 2005లో ఎవరికీ తెలియకుండా రహస్య వివాహం చేసుకున్నారు. ఈ పెళ్ళికి ఇరు కుటుంబాల సభ్యులు మాత్రమే హాజరయ్యారు. మహేష్ అంత నిరాడంబరంగా వివాహం చేసుకోవడానికి కారణం ఏమిటో తెలియదు.
37
Image: Namrata Shirodkar / Instagram
పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పింది నమ్రత. తన ఇద్దరు పిల్లలు గౌతమ్, సితారల ఆలనాపాలనా చూసుకుంది. పిల్లలు పెద్దయ్యాక మహేష్ బాబుకు సలహాదారుగా, బిజినెస్ ఉమన్ గా మారింది. మహేష్ బాబు సంపాదన పెట్టుబడిగా మారుస్తుంది నమ్రత. ఆయనకు సంబంధించిన వ్యవహారాలు చక్కబెడుతుంది.
47
Namrata Shirodkar
2004 తర్వాత నమ్రత సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. పెళ్ళయాక పూర్తిగా సినిమాలు వదిలేస్తాను అని నమ్రత మహేష్ కి హామీ ఇచ్చారట. ఇచ్చిన మాట ప్రకారం గత ఇరవై ఏళ్లలో ఆమె ముఖానికి మేకప్ వేసుకోలేదు. నిర్మాతగా మాత్రం వ్యవహరిస్తున్నారు. అయితే ఆమె నటిగా రీ ఎంట్రీ ఇస్తున్నట్లు టాలీవుడ్ టాక్.
57
Namrata Shirodkar
నమ్రత శిరోద్కర్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నారట. ఆమె ఓ చిత్రానికి సైన్ చేశారట. ప్రముఖ ఫ్యామిలీకి చెందిన యంగ్ హీరో మూవీలో నమ్రత కీలక రోల్ చేస్తున్నారట. మరొక విశేషం ఏమిటంటే.. నమ్రత పాత్ర నెగిటివ్ షేడ్స్ తో కూడి ఉంటుందట. నమ్రత సిల్వర్ స్క్రీన్ పై కనిపించడం ఖాయం అంటున్నారు.
67
Renu Desai and Namrata Shirodkar
ఈ క్రమంలో రేణు దేశాయ్ ని గుర్తు చేసుకుంటున్నారు. నమ్రత-రేణు దేశాయ్ లకు కొన్ని పోలికలు ఉన్నాయి. వీరిద్దరూ నార్త్ బ్యూటీస్. అలాగే వివాహం తర్వాత యాక్టింగ్ వదిలేశారు. పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్నప్పటికీ నమ్రత నటించలేదు. పిల్లలతో పాటు పూణేలో ఉండిపోయింది.
77
అయితే గత ఏడాది రీ ఎంట్రీ ఇచ్చింది. రవితేజ హీరోగా నటించిన పీరియాడిక్ బయోపిక్ టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో ఆమె ఓ కీలక పాత్ర చేసింది. ఆమె సంఘ సంస్కర్త పాత్రలో కనిపించారు. ఆఫర్స్ వస్తే సినిమాలు చేయడానికి రేణు దేశాయ్ సిద్ధంగా ఉంది. తాజాగా నమ్రత సైతం నటిగా మారనుందనే టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు...