నటుడు మోహన్ బాబు కుమారులు విష్ణు, మనోజ్ మధ్య వివాదాలు తలెత్తాయనే వాదన చాలా కాలంగా ఉంది. మనోజ్ ఆ కుటుంబానికి దూరంగా వెళ్ళిపోయాడు. చెన్నైలో మౌనికతో పాటు కొన్నాళ్ళు రహస్యంగా ఉన్నట్లు మనోజ్ ఓ షోలో స్వయంగా వెల్లడించారు. భూమా మౌనిక రెడ్డిను మనోజ్ పెళ్లి చేసుకోవడం మోహన్ బాబు, విష్ణుకు ఇష్టం లేదనే ప్రచారం జరిగింది.