మళ్లీ కెలుక్కున్న సిద్దార్ద్, సీఎం రేవంత్ రెడ్డికే కౌంటర్?

Published : Jul 09, 2024, 07:17 AM IST

సోషల్ మీడియాలో సిద్దార్ద్ పై నెగిటివ్ పోస్ట్ లు పడుతున్నాయి. అది భారతీయుడు 2 సినిమాపై ఇంపాక్ట్ కూడా పడచ్చు అంటున్నారు.   

PREV
112
   మళ్లీ కెలుక్కున్న సిద్దార్ద్, సీఎం రేవంత్ రెడ్డికే కౌంటర్?


సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ నియంత్రణపై అవగాహన కల్పించేలా వీడియోలు చేయాలని సినీ నటులకు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఇటీవల సూచించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ నటులకు సామాజిక బాధ్యత ఉందంటారా? అని 'భారతీయుడు 2' టీమ్ ని విలేకరి ప్రశ్నించగా సిద్ధార్థ్ స్పందించారు. అయితే ఆయన మాటల్లో అందరినీ  సెటైర్ చేస్తూ, మాకు ఒకళ్లు చెప్పాలా యాడ్స్ చేయమని అన్నట్లు ధ్వనించింది. అయితే తర్వాత వివరణ ఇచ్చినా అది జనంలోకి వెళ్లిపోయింది. సోషల్ మీడియాలో సిద్దార్ద్ పై నెగిటివ్ పోస్ట్ లు పడుతున్నాయి. అది భారతీయుడు 2 సినిమాపై ఇంపాక్ట్ కూడా పడచ్చు అంటున్నారు.   అసలేం జరిగింది. 

212


హీరో సిద్దార్ద్ కు మీడియాపై విరుచుకుపడటం కొత్తేమీ కాదు. ఇటు తెలుగు మీడియా పైనా, అటు  నేషనల్ మీడియాపైనా అవకాసం వచ్చినప్పుడల్లా సెటైర్స్ వేస్తూ ప్రెస్ మీట్స్ తో తనదైన శైలిలో బిహేవ్ చేస్తూ వార్తల్లో నిలుస్తూంటారు. అయితే ఆయన ఇలాగే ఉంటాడని ఎంత అలవాటుపడినా ఏదో విధంగా మీడియాని కెలికినప్పుడల్లా రచ్చ అవుతోంది. తాజాగా మరోసారి సిద్దార్ద్ ..తెలుగు మీడియాపై ప్రెస్ మీట్ లోనే సెటైర్స్ వేస్తూ రచ్చ చేసే ప్రయత్నం చేసారు. 

312


తెలుగు లో ఒకప్పుడు స్టార్‌ హీరోగా మంచి గుర్తింపు దక్కించుకున్నారు సిద్దార్ద. నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. బొమ్మ‌రిల్లు..చిత్రాల‌తో ల‌వ‌ర్ బోయ్ ఇమేజ్ తో టాలీవుడ్ లో చాల స్ట్రాంగ్ గా ఎస్టాబ్లీష్ అయ్యాడు. అయితే ఈ రెండు చిత్రాలు ఇచ్చిన స‌క్సెస్ తో  తర్వాత  చాల చిత్రాలు చేశాడు. అయితే ఏమీ కలిసి రాలేదు. ఆ తర్వాత అటు హిందీకి, ఇటు తమిళంకు వెళ్లి సినిమాలు చేస్తున్నాడు.

412


ఎందుకంటే  సిద్ధుకి ప్రస్తుతం తెలుగులో  అస్సలు మార్కెట్‌ లేదు. శర్వానంద్ తో కలిసి నటించిన మహాసముద్రం డిజాస్టర్‌ అవ్వగా.. టక్కర్‌ సినిమా తెలుగు లో డబ్‌ అయ్యి తీవ్రంగా నిరాశ పరిచింది. ఆ తర్వాత వచ్చిన చిన్నా సినిమా పైనా తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి  చూపలేదు.జిల్ జుంగ్ జుంక్ పేరు తో ఒక చిత్రం చేశాడు. ఇది తమిళం లో వైవిధ్య‌మైన చిత్రంగా పేరు పొందింది. ఆ మ‌ధ్య వ‌చ్చిన క‌ళావ‌తి చిత్రం లో సిద్దు వున్న విష‌య‌మే ఆడియ‌న్స్ కు పెద్ద‌గా రీచ్ కాలేదు. హ‌న్సిక‌, త్రిష ల‌కే ఆ క్రెడిట్ అంతా పోయింది.ఇలా సిద్దుకు తెలుగులో మార్కెట్ లేకుండాపోయింది. 

512
siddharth


అయినా త‌ను కోలీవుడ్ కు వెళ్లి చేసిన చిత్రాలు కొన్ని తెలుగులో డ‌బ్బింగ్ చిత్రాలుగా చేశారు. అవి ఇక్క‌డ ఆడ‌క పోయో స‌రికి ..హీరో సిద్దు..ఏకంగా తెలుగు ఆడియ‌న్స్ కు టేస్ట్ లేద‌ని వ్యాఖ్యానించాడు. దీంతో మ‌నోడిని పూర్తిగా ప్రక్కన పెట్టేసారు. కెరీర్ లో స‌క్సెస్..ఫెయిల్యూర్స్ కామ‌న్..కానీ.. నోటి దూల‌తో అతను అవకాశాలను దూరం చేసుకోవటమే కాకుండా మీడియాకు దూరం అవటం మొదలెట్టారు. దాన్ని కంటిన్యూ చేస్తూ తాజాగా భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ రెచ్చిపోయాడు. 

612
Siddharth

 
కమల్ హాసన్ హీరోగా సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జె సూర్య, సముద్రఖని, బ్రహ్మానందం వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రలలో నటించిన తాజా చిత్రం భారతీయుడు 2, ఈ సినిమా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కింది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించింది. జులై 12వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా టీం  హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఇక   మీడియాతో ముచ్చటించింది. 

712


ఈ సందర్భంగా ఒక మీడియా ప్రతినిధి ఇటీవల రేవంత్ రెడ్డి టికెట్ రేట్ ల పెంపు కోసం సినిమా టీమ్స్ ప్రభుత్వాన్ని ఆశ్రయించినప్పుడు సోషల్ అవేర్నెస్ కోసం కొన్ని వీడియోలు చేయాలని సూచించారు, మీరు ఏవైనా సోషల్ అవేర్నెస్ కోసం వీడియోలు చేస్తున్నారా? మీకు ఎంతవరకు సామాజిక బాధ్యత ఉంది అని ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్న అడిగింది కమల్ హాసన్ ని. 

812


అయితే కమల్ ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చేలోగా సిద్దార్ద దూరిపోయారు.  నేను 20 ఏళ్ల నుంచి తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు 20 ఏళ్ల క్రితమే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి సేఫ్ సెక్స్ కోసం కండోమ్ పట్టుకొని రోడ్ ఎక్కాను. దాదాపుగా అప్పట్లో ఈ కండోమ్ ప్రచారానికి సంబంధించి నా ఫోటోలతో ఏపీ మొత్తం హోర్డింగ్స్ ఉండేవి, ఆ బాధ్యత నా బాధ్యత. ఒక చీఫ్ మినిస్టర్ చెబితే నాకు బాధ్యత రాదు. అలాగే ఒక యాక్టర్ కి బాధ్యత సామాజిక బాధ్యత ఉందా అని అడిగితే అసలు ఆ ప్రశ్న నాకు అర్థం కాలేదు అన్నారు. తనను తాను బూస్ట్ చేసుకోవటం కోసం కమల్ ప్రశ్నకు తను సమాధానం చెప్పటం అందరికీ షాక్ ఇచ్చింది.

912


అక్కడితో ఆగకుండా  ప్రతి నటుడు, నటి సామాజిక బాధ్యతతోనే ఉంటారు. మాకు ఉన్న సామాజిక స్పృహ నేపథ్యంలో మేం చేయగలిగింది మేం చేస్తాం .ముఖ్యమంత్రి మమ్మల్ని ఏమైనా కావాలని కోరితే మేము చేస్తాం. ఏ సీఎం కూడా మీరు ఇది చేస్తేనే మీకు అది చేస్తామని చెప్పలేదు అంటూ ఆయన కామెంట్ చేశారు. కమల్,రకుల్ వంక చూస్తూ ...కమల్ సార్, రకుల్ మీరెవరూ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన పని లేదు అని అన్నారు. 
 

1012

రచ్చ అంతా జరిగాక ..దీనిపై స్పందించారు. తాను ఓ కోణంలో చెబితే దాన్ని కొందరు మరో కోణంలో చిత్రీకరించారని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా వీడియో పోస్ట్‌ చేశారు.  ‘‘భారతీయుడు 2’ ప్రెస్‌మీట్‌లో ఓ ప్రశ్నకు నేనిచ్చిన సమాధానాన్ని కొందరు అపార్థం చేసుకున్నారు. దాన్ని నేను క్లియర్‌ చేయాలనుకుంటున్నా. డ్రగ్స్‌పై పోరాటం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్‌ రెడ్డి గారికి నా పూర్తి మద్దతిస్తా. మెరుగైన సమాజం కోసం డ్రగ్స్‌ కట్టడికి చిత్ర పరిశ్రమ తన వంతు కృషి చేయాలని సీఎం సూచించారు. మన పిల్లల భవిష్యత్తు వారి చేతుల్లోనే కాకుండా మన చేతుల్లోనూ ఉంది. ఇప్పటి వరకూ పలు సామాజిక కార్యక్రమాలను నేను సపోర్ట్‌ చేశా. సీఎం సర్‌.. మేం ఎప్పుడూ మీతోనే’’ అని పేర్కొన్నారు.

1112


 గతంలో  చిన్నా సినిమా రిలీజ్ టైమ్ లో ఆ సినిమా కి సాధ్యం అయినని సినిమాలు ఇచ్చినా కూడా తాజా మీడియా సమావేశంలో సిద్ధార్థ్‌ తనకు థియేటర్లు ఇవ్వడం లేదు అంటూ నిర్మాతలపై విమర్శలు చేయడం చర్చనీయాంశం అయింది.  ఇతర భాషల్లో చిత్తా సినిమాకి ఎక్కువ థియేటర్లు దక్కాయి. కానీ తెలుగు వారు మాత్రం నాకు అన్యాయం చేస్తున్నారు. థియేటర్లు ఇవ్వమంటే సిద్ధార్థ్‌ సినిమాని ఎవరు చూస్తారు అంటూ థియేటర్లు ఇవ్వడం లేదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. 
 

1212


సిద్ధార్థ్‌ చేసిన ఆరోపణలపై తెలుగు నిర్మాతలు, బయ్యర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. వరుస ఫ్లాప్‌ సినిమాలతో మార్కెట్‌ కోల్పోయిన సిద్ధార్థ్‌ ఇప్పుడు తన సినిమా కు థియేటర్లు ఇవ్వడం లేదు అంటూ మాపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. ప్రేక్షకుల్లో బజ్‌ ఉంటే పోటీ పడి మరీ ఎక్కువ థియేటర్లు ఇస్తారు. సినిమా విడుదల అయిన తర్వాత పాజిటివ్ టాక్ వస్తే రెండు రోజుల్లోనే పెద్ద ఎత్తున థియేటర్ల సంఖ్య పెంచే అవకాశం కూడా ఉంటుంది. కానీ సిద్ధార్థ్‌ ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా విమర్శలు చేయడం సరికాదని కొందరు చురకలు అంటించారు.

click me!

Recommended Stories