వీళ్ళ పనే బావుంది, కష్టం లేకుండా కోట్లకి కోట్ల డబ్బు..అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే ఐటమ్ బ్యూటీలు

First Published | Aug 4, 2024, 1:54 PM IST

మాస్ చిత్రాల్లో ఐటెం సాంగ్ ఉండడం అనేది చాలాకాలంగా  కాలంగా కొనసాగుతున్న ట్రెండ్. చిత్రానికి ఐటెం సాంగ్ స్పెషల్ అట్రాక్షన్. దీని కోసం దర్శక నిర్మాతలు ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడరు.

మాస్ చిత్రాల్లో ఐటెం సాంగ్ ఉండడం అనేది చాలాకాలంగా  కాలంగా కొనసాగుతున్న ట్రెండ్. చిత్రానికి ఐటెం సాంగ్ స్పెషల్ అట్రాక్షన్. దీని కోసం దర్శక నిర్మాతలు ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడరు. హీరోయిన్లనే ఐటెం సాంగ్స్ కోసం తీసుకువచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. హీరోయిన్ గా అయితే సినిమా మొత్తం మొత్తం నటించాలి. ఐటమ్ సాంగ్ కోసం కష్టపడాల్సిన అవసరం  ఉండదు. అయినా కోట్ల రెమ్యునరేషన్ ఇస్తారు. ఐటమ్ సాంగ్స్ కోసం అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటీమణులు ఎవరో ఇప్పుడు చూద్దాం. 

ఊర్వశి రౌతేలా : దేశవ్యాప్తంగా ప్రస్తుతం సూపర్ క్రేజ్ ఐటెం బ్యూటీ ఊర్వశి రౌతేలా. ముఖ్యంగా టాలీవుడ్ లో  మామూలుగా లేదు. వాల్తేరు వీరయ్య, ఏజెంట్, బ్రో, స్కంద లాంటి చిత్రాల్లో ఊర్వశి రౌతేలా ఐటెం సాంగ్స్ చేసింది. ఒక్కో సాంగ్ కి ఆమె 2 నుంచి 3 కోట్ల వరకు పారితోషికం అందుకుంటుంది. కొందరు హీరోయిన్లకు నెలలు తరబడి సినిమా మొత్తం హీరోయిన్ గా నటించినా కోటి రూపాయలు రెమ్యునరేషన్ దక్కడం కష్టం. 


సన్నీ లియోన్ : శృంగార తార సన్నీ లియోన్ కూడా బోల్డ్ రోల్స్ తో పాటు స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. రాజశేఖర్ గరుడవేగా చిత్రంలో సన్నీలియోన్ ఐటెం సాంగ్ చేసింది. ఈ సాంగ్ కి ఆమె 2 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంది. 

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ : శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా ఒక్కో ఐటెం సాంగ్ కి 2 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుంది. హీరోయిన్ గా రాణిస్తూనే స్పెషల్ సాంగ్స్ చేస్తుంది. 

మలైకా అరోరా: ఒకరకంగా ఐటెం సాంగ్స్ కి క్రేజ్ తీసుకువచ్చింది మలైకా అరోరా అనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఆమె హవా బాగా తగ్గింది. మలైకా అరోరా స్పెషల్ సాంగ్ కోసం 50 లక్షల పైన డిమాండ్ చేస్తుందట. 

సమంత : ఐటెం సాంగ్ విషయంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుని సమంత రికార్డు సృష్టించింది. పుష్ప చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం సమంత 5 కోట్ల తీసుకుందని టాక్. కేవలం మూడు నిమిషాల సాంగ్ కోసం 5 కోట్లు అంటే మహా కాస్ట్లీ అని చెప్పొచ్చు. 

తమన్నా :తమన్నా ఇటీవల తన ఐటెం సాంగ్స్ తో యువతకి అందాల విందు వడ్డిస్తోంది. రజనీకాంత్ జైలర్ చిత్రంలో తమన్నా స్పెషల్ సాంగ్ తో పాటు క్రేజీ ఐటెం నంబర్ చేసింది. ఈ సాంగ్ వల్ల కూడా సినిమాకి హైప్ పెరిగింది. 

Latest Videos

click me!