సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న వారణాసి మూవీ టైం ట్రావెల్ కథాంశంతో రూపొందుతోంది. ఇందులో రామాయణం అంశాలు కూడా ఉంటాయి. మరో అంశం కూడా కథలో కీలకంగా ఉంటుంది అని రాజమౌళి తెలిపారు.
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం వారణాసిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించనున్నారు. వారణాసి నేపథ్యంలో సాగే ఈ కథలో ఆయన ప్రయాణం కేవలం ఆ నగరానికే పరిమితం కాకుండా కాలాన్ని దాటి రామాయణ యుగానికి కూడా చేరుతుందని తెలుస్తోంది. సినిమాలోని ఒక కీలక ఘట్టంలో మహేష్ బాబు శ్రీరాముడిగా కనిపించనున్నారనే అంశం కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
25
భారీ తారాగణంతో రాజమౌళి చిత్రం
ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడీగా ప్రియాంక చోప్రా జోనాస్ నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రకాష్ రాజ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాల్లో మహేష్ బాబుకు తండ్రిగా నటించిన ప్రకాష్ రాజ్, వారణాసిలో కూడా ఆయన తండ్రి పాత్రలో కనిపించనున్నారు.
35
తండ్రి కొడుకుల బంధమే అసలు ఎమోషనల్ కోర్
వారణాసి గురించి రాజమౌళి చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు చిత్ర కథపై కొత్త చర్చకు దారితీశాయి. ఈ సినిమా భారీ స్థాయిలో రూపొందుతున్నప్పటికీ, ఇందులో టైమ్ ట్రావెల్, అడ్వెంచర్, విజువల్ ఎఫెక్ట్స్, పౌరాణిక అంశాలు వంటి ఎన్నో అంశాలు ఉన్నప్పటికీ కథకు అసలైన భావోద్వేగ కేంద్రం మాత్రం తండ్రి కొడుకుల బంధమేనని రాజమౌళి వెల్లడించారు. తండ్రి, కొడుకు మధ్య ఉన్న అనుబంధం చుట్టూనే కథలోని ప్రధాన భావోద్వేగ ప్రయాణం సాగుతుందని ఆయన చెప్పినట్లు సమాచారం. ఈ ఎమోషనల్ థ్రెడ్ సినిమా కథనం మొత్తం కొనసాగుతుందని తెలుస్తోంది.
రాజమౌళి వెల్లడించిన ఈ అంశం వారణాసి కథపై ఇప్పటికే జరుగుతున్న ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. ఒక పాత హాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌లోని ప్రధాన భావన నుంచి రాజమౌళి స్ఫూర్తి పొందారని, దానికి భారతీయ పురాణాలు, టైమ్ ట్రావెల్, ఆధునిక విజువల్ ఎఫెక్ట్స్‌ను జోడించి కొత్త రూపంలో కథను రూపొందించారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు విడుదలైన కంటెంట్‌తో పాటు సినిమా ప్రధాన థీమ్‌పై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు కూడా ఈ పోలికలకు మరింత ఆస్కారం కల్పిస్తున్నాయి.
55
భారతీయ ఎపిక్ అడ్వెంచర్‌గా వారణాసి
అయితే హాలీవుడ్ చిత్రంతో వారణాసికి ఉన్న అసలు పోలికలు ఏమిటనేది సినిమా విడుదలైన తర్వాతే స్పష్టమవుతుంది. రాజమౌళి తనదైన శైలిలో ఒక పరిచితమైన భావనను భారతీయ పురాణాలు, రామాయణ కాలం, టైమ్ ట్రావెల్ అంశాలతో ఎలా మిళితం చేశారనే ఆసక్తి ప్రస్తుతం నెలకొంది. భారీ విజువల్ స్పెక్టకిల్‌తో పాటు తండ్రి కొడుకుల అనుబంధాన్ని కథకు ప్రధాన భావోద్వేగ బలంగా మార్చడం ద్వారా వారణాసిని ఒక విభిన్నమైన భారతీయ ఎపిక్ అడ్వెంచర్‌గా రాజమౌళి రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు రుద్ర పాత్రతో పాటు శ్రీరాముడిగా కనిపించనున్న అంశం కూడా ఈ చిత్రంపై మరింత ఉత్కంఠను పెంచుతోంది.