మహేష్‌ బాబు స్టయిలీష్‌ లుక్‌ మామూలుగా లేదుగా.. రాజమౌళి సినిమాకి సంబంధించిన హింట్‌ అదేనా?

First Published Apr 1, 2024, 9:06 PM IST

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు  సడెన్‌గా కొత్త లుక్‌లోకి మారిపోయాడు. లేటెస్ట్ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు మహేష్‌. అదే సమయంలో నెక్ట్స్ సినిమాకి సంబంధించిన హింట్‌ ఇచ్చేశాడు. 

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం ప్రిపేర్‌ అవుతున్నాడు. బాడీ వర్కౌట్స్ చేస్తున్నారు. మరోవైపు రాజమౌళి స్క్రిప్ట్ ఫైనల్ చేయడంతోపాటు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ చేస్తున్నారు. ఆర్టిస్టులను ఫైనల్‌ చేసే పనిలో ఉన్నారు. దీంతోపాటు షూటింగ్‌ లొకేషన్లు, ఎప్పుడు ఏం చేయాలనేది ప్లాన్‌ చేస్తున్నాడు. ఎవరికి వాళ్లు బిజీగా ఉన్నారు. 
 

ఇక ఇటీవలే మహేష్‌ బాబు విదేశాలకు వెకేషన్‌కి వెళ్లి వచ్చారు. మళ్లీ వర్క్ పై ఫోకస్‌ పెట్టాడు. తాజాగా మహేష్‌ బాబుకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తున్నాయి. ఇందులో మహేష్‌ బాబు లక్‌ మాత్రం అదిరిపోయింది. ఆమె మరింత స్టయిల్‌గా, అందంగా కనిపిస్తున్నారు. ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా చేస్తున్నారు. 
 

`ఓట్టో` బ్రాండ్‌ క్లాత్స్ ప్రమోషన్‌లో భాగంగా మహేష్‌ బాబు ఈ ప్రమోషన్స్ కోసం ఆయన ఫోటో షూట్‌ చేశారు. ఇందులో ఆయన హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నారు. కాజ్వల్స్ లో మహేష్‌ మరింత యంగ్‌గా ఉన్నారు. గ్రీన్‌ టీషర్ట్ లో సూపర్‌ స్టార్‌ లుక్‌ కేక అనిపించేలా ఉండటం విశేషం. ఈ లుక్స్ పై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఓ ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని చర్చిస్తున్నారు. 
 

మహేష్‌ బాబు నెక్ట్స్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. గ్లోబల్ మూవీగా దీన్ని ఆయన తీర్చిదిద్దబోతున్నారు. ఆ ప్రిపరేషన్‌ జరుగుతుంది. అయితే ఇందులో మహేష్‌ బాబు ఎలా కనిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఆ మధ్య ఇప్పటికే తొమ్మిది గెటప్స్ ని ట్రై చేశాడట దర్శకుడు రాజమౌళి. ఆయా లుక్స్ ని పక్కన పెట్టారట. ఇందులో ఒకటి రెండు లుక్స్ ని ఫైనల్‌ చేసే అవకాశం ఉంది. 
 

అయితే ఇందులో సూపర్‌ స్టార్‌ మహేష్‌ లుక్‌పై ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తుంది. ఆయన హెయిర్‌ స్టయిల్‌ గురించి మాట్లాడుకుంటున్నారు. మహేష్‌ బాబు హెయిర్‌ పెద్దగా ఉంది. క్రమంగా పెంచుతున్నట్టుగా ఉంది. వెనకాల ఎక్కువగా ఉంది. దీంతో ఇందులో మహేష్‌ బాబు కాస్త పెద్ద ఎయిర్‌తో కనిపిస్తాడని తెలుస్తుంది. `SSMb29` లో మహేష్‌ బాబు ఫారెస్ట్ లో సాహసికుడిగా కనిపిస్తాడట. అందుకోసమే ఆయన ఈ హెయిర్ పెంచుతున్నట్టు అనిపిస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 
 

మహేష్‌ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ మూవీ ఈఉగాదికి ప్రారంభం అవుతుందన్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ లేదు. దీంతో ఓపెనింగ్‌ ఇప్పుడు ఉంటుందా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. ఈ చిత్రంలో బాలీవుడ్‌తోపాటు విదేశీ నటీనటులు కనిపిస్తారని సమాచారం. సుమారు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. 
 

click me!