టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు (Samantha) ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి రిలాక్స్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పడిప్పుడే మళ్లీ యాక్టివ్ గా కనిపిస్తున్నారు.
తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి కూడా ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ మేరకు సమంత మున్ముందు చేయబోయే పలు సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయ్యింది.
होली में लगेंगी देसी गर्ल , पहने सामंथा प्रभु की 8 साड़ियां
తాజాగా మాత్రం సమంత మరోసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సరసన నటించబోతున్నట్టు న్యూస్ వినిపిస్తోంది. ఇప్పటికే రెండు సార్లు బన్నీ సరసన సామ్ దుమ్ములేపిన విషయం తెలిసిందే.
‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ చిత్రంలో సమంత అల్లు అర్జున్ సరసన నటించి మెప్పించిన విషయం తెలిసిందే. అలాగే ‘పుష్ప’ చిత్రంలో ‘ఊ అంటావా మావ’ ఐటెమ్ సాంగ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఇక మరోసారి అల్లు అర్జున్ తో కలిసి సమంత నటించేందుకు సిద్ధమయ్యారు. అది కూడా అల్లు అర్జున్ - అట్లీ కుమార్ (Atlee Kumar) కాంబోలో రాబోతున్న AAA ప్రాజెక్ట్ లో అని తెలుస్తోంది.
అయితే అట్లీ తన చిత్రాల్లో ఫీమేల్ క్యారెక్టర్లను చాలా స్ట్రాంగ్ గా, స్ఫూర్తిదాయకంగా చూపిస్తుంటారు. అలాంటిది సమంత ఆయన దర్శకత్వంలో నటించబోతుండటంతో ఇంకెలా చూపిస్తారోనని ఆసక్తి నెలకొంది. కానీ ఈ ప్రాజెక్ట్ లో సామ్ పై అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది.