వారణాసిలో మహేష్ బాబు కొడుకు, గౌతమ్ ఘట్టమనేని కి రాజమౌళి ఏ పాత్ర ఇచ్చాడో తెలుసా?

Published : Apr 18, 2026, 01:18 PM IST

రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ మూవీ వారణాసి. ఈ సినిమా నుంచి షాకింగ్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడు బయటకు వస్తున్నాయి. ఈక్రమంలోనే వారణాసి నుంచి మరో వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే?

PREV
15
ఆస్కార్ ను మించి ప్లాన్ చేస్తున్న రాజమౌళి..

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం పాన్ వరల్డ్ మూవీ వారణాసితో బిజీగా ఉన్నాడు. మహేష్ బాబును సూపర్ హీరోగా చూపించబోతున్నాడు. అందుకు తగ్గట్టు మహేష్ బాబు కూడా తన లుక్ ను, ఫిట్ నెస్ ను పెంచుకున్నాడు. దాదాపు 1500 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈమూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ సాధించిన రాజమౌళి టీమ్.. ఈ సారి అంతకు మించి ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే షూటింగ్ కూడా కొనసాగుతోంది.

25
వారణాసిలో ట్విస్టులెన్నో..

ఇక వారణాసికి సబంధించి ఇప్పటికే రకరకాల వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈసినిమాలో నటించబోయే స్టార్ కాస్ట్ పై ఎప్పటికప్పుడు కొత్త వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ ఇందులో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్, ప్రకాశ్ రాజ్ లాంటి స్టార్స్ పేర్లు మాత్రమే వినిపించాయి. మిగిలిన నటీనటులపై ఇంత వరకూ క్లారిటీ లేదు. రాజమౌళి కూడా అఫీషియల్ గా ఈ విషయాన్ని అనౌన్స్ చేయలేదు. ముందు ముదు ఈసినిమాలో చాలా ట్విస్ట్ లు ఉన్నట్టు తెలుస్తోంది.

35
రాజమౌళి మూవీ కోసం హార్డ్ వర్క్ చేస్తోన్న మహేష్..

ఈక్రమంలో వారణాసికి సబంధించిన ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడుతున్నారని తెలుస్తోంది. రాజమౌళి చెప్పినట్టు వింటూ.. మార్పులు ఉంటే చేసుకుంటూ.. మహేష్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారని సమాచారం. ఇక ఈక్రమంలో ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం బయటకు వినిపిస్తోంది. ఈ మూవీలో మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ కూడా నటించబోతున్నట్టు సమాచారం.

45
వారణాసిలో గౌతమ్ కృష్ణ నటిస్తున్నాడా?

ఇప్పటికే వన్ నేనొక్కడినే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన గౌతమ్.. ఆతరువాత స్టడీస్ కోసం ఫారెన్ వెళ్లాడు. రీసెంట్ గా తన స్టడీస్ పూర్తి చేసుకున్నాడట. వారణాసిలో గౌతమ్ కు సూట్ అయ్యే ఓ పాత్ర ఉండటంతో.. రాజమౌళి గౌతమ్ ను తీసుకున్నాడని సమాచారం. ఈ సినిమాలో గౌతమ్ కృష్ణకు సూట్ అయ్యే క్యారెక్టర్ ఉండటంతో.. జక్కన్నే స్వయంగా ఈ పాత్రను గౌతమ్ తో చేయించాలని అనుకున్నాడట. 

మహేష్ బాబు, గౌతమ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఎలా ఉంటాయన్నదానిపై ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలయ్యింది. ఈ విషయం అపీషియల్ గా మాత్రం అనౌన్స్ చేయలేదు. అంతేకాదు ఆ పాత్ర ఏంటో కూడా ఎవరికి తెలియదు. ఈ విషయంలో నిజం ఎంతో తెలియాలంటే.. అధికారికంగా ప్రకటించే వరకూ ఆగాల్సిందే.

55
వారణాసి రిలీజ్ ఎప్పుడు?

నిజంగా ఈసినిమాలో గౌతమ్ కనిపిస్తే.. ముందు ముందు మహేష్ బాబు వారసుడిగా గౌతమ్ కృష్ణ ఎంట్రీ కి రూట్ క్లియర్ అయినట్టే అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరీ ముఖ్యంగా రాజమౌళి వంటి దర్శకుడి సినిమా ద్వారా గౌతమ్ కృష్ణ ఎంట్రీ ఇస్తే.. అది అతని కెరీర్ కు ప్లస్ అవుతుందని మహేష్ అభిమానులు భావిస్తున్నారు. ఇక వారణాసి షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా సాగుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈసమ్మర్ కానుకగా ఈసినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories