విజయ్ దేవరకొండ, శౌర్యువ్ కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ మాత్రం అదిరిపోయేలా ఉంది.
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గత రెండు నెలలుగా టాలీవుడ్‌లోనే కాదు ఇండియా వైడ్‌గా చర్చనీయాంశంగా మారారు. తన పెళ్లి పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్నాని విజయ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న వీరి వివాహం జరిగింది. ఆ తర్వాత వరుసగా పలు విందు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సొంతింట్లో వ్రతం చేశాడు, ఆ తర్వాత సంగీత్ కార్యక్రమం, అభిమానులకు ప్రత్యేకమైన విందు, మీడియాకి విందు, ఆ తర్వాత ఇండస్ట్రీ వర్గాలకు మరో విందుని ఏర్పాటు చేశారు. అందరిని కలిశారు. ఇటీవల రష్మిక మందన్నా ఊరికి వెళ్లి సందడి చేశారు.
24
హాయ్ నాన్న దర్శకుడిగా విజయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్
తాజాగా విజయ్ దేవరకొండ తన కొత్త సినిమాని ప్రకటించారు. `హాయ్ నాన్న` ఫేమ్ శౌర్యువ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. వీడీ ఎక్స్ శౌర్యువ్ పేరుతో దీన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ అదిరిపోయింది. ఇందులో నాలుగు బ్లాక్ డాగ్స్ ని పట్టుకుని రాజులా నడిచి వస్తుండగా, వెనక ఏడుగురు వ్యక్తులు వివిధ రకాల ఆయుధాలు చేపట్టి రావడం ఆసక్తి కలిగిస్తోంది. దర్శకుడు శౌర్యువ్ గుర్రాన్ని పట్టుకొని వస్తున్నాడు. ఈ సందర్భంగా `ఇప్పుడు కనిపించే కోపమంతా ఒకప్పటి ప్రేమ` అంటూ పోస్టర్ పై రాసిన క్యాప్షన్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. మైథాలజికల్ యూనివర్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న ఈ సినిమా ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించనుంది. ఇలాంటి పోస్టర్ కూడా ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో చూడలేదని చెప్పొచ్చు. ఒకప్పటి ప్రేమ ఇప్పుడు యుద్ధానికి దారితీసిందా? ఆగ్రహానికి దారి తీసిన అంశాలేంటి? అనే కథాంశంతో మూవీ సాగబోతున్నట్టు తెలుస్తోంది.
34
మతిపోయేలా ఉన్న విజయ్ కొత్త సినిమా పోస్టర్
ఈ మూవీని గ్లోబల్ ఫిల్మ్ గా రూపొందిస్తున్నారు. అంతర్జాతీయ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు హీరో విజయ్ దేవరకొండ తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. వైరా బ్యానర్ నిర్మిస్తున్న ఈ ప్రెస్టీజియస్ మూవీ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ సినిమా మీద హై ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేస్తోంది. విజయ్ దేవరకొండ, డైరెక్టర్ శౌర్యువ్ సినిమాకు `హౌస్ ఆఫ్ ది డ్రాగన్`, `ఫాల్ ఔట్` వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన అలెజాండ్రో మార్టినెజ్ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. `గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్`, `బ్యాట్ మ్యాన్ ఫరెవర్`, `స్నోపియర్సర్` చిత్రాల వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ ఎరిక్ డస్ట్ర్ ఈ మూవీకి పనిచేస్తున్నారు. యానిమల్, ఓం శాంతి ఓం వంటి చిత్రాలకు పనిచేసిన సురేష్ సెల్వరాజన్ ఈ సినిమా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. పలు సూపర్ హిట్ చిత్రాల కంపోజర్ హేషమ్ అబ్దుల్ వాహాబ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం `రణబాలి` చిత్రంలో నటిస్తున్నారు. దీనికి రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది చిత్రీకరణ దశలో ఉంది. సెప్టెంబర్‌లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. దీంతోపాటు రవి కిరణ్ కోలా దర్శకత్వంలో `రౌడీ జనార్థన్` మూవీ చేస్తున్నాడు విజయ్. ఇది కూడా చిత్రీకరణ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పుడు కొత్తగా శౌర్యువ్ తో సినిమాని ప్రకటించాడు విజయ్. ఇది వచ్చే ఏడాది ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది. `హాయ్ నాన్న` తర్వాత దర్శకుడు చేస్తున్న సినిమా ఇది.