Bad Boy Karthik: 30కోట్లు పెట్టి సినిమా తీస్తే, టీ ఖర్చులు కూడా రాలే.. నాగశౌర్య మూవీకి దారుణమైన కలెక్షన్లు

Published : Apr 18, 2026, 11:31 AM IST

Bad Boy Karthik: హీరో నాగశౌర్య నటించిన `బ్యాడ్‌ బాయ్‌ కార్తీక్‌` చిత్రంతో ఈ శుక్రవారం విడుదలైంది. 30కోట్లతో రూపొందిన ఈ చిత్రానికి టీ ఖర్చులు కూడా రాలేదట. 

PREV
14
ఒకప్పుడు క్రేజీ స్టార్‌గా రాణించిన నాగశౌర్య

నాగశౌర్య ఒకప్పుడు టాలీవుడ్‌లో ప్రామిసింగ్‌ హీరో. `ఊహలు గుసగుసలాడే` చిత్రంతో ఒక్కసారిగా పాపులర్‌ అయ్యాడు `దిక్కులు చూడకు రామయ్య`, `లక్ష్మీ రావే మాఇంటికి`, `జాదూగాడు`, `కళ్యాణ వైభోగమే`, `జ్యో అచ్చుతానంద`, `ఛలో` చిత్రాలతో ఆకట్టుకున్నాడు. కానీ ఇటీవల ఆయనకు విజయాలు లేవు. దీంతో సినిమా సినిమాకి కెరీర్‌ గ్రాఫ్‌ పడిపోతూ వచ్చింది. ఇప్పుడు ఏ పరిస్థికి వచ్చిందంటే ఆయన సినిమా వస్తుందని కనీసం జనాలకు కూడా తెలియదు. ప్రమోషన్స్ లేకపోవడంతో ఆడియెన్స్ దీన్ని పట్టించుకోలేదు. కొత్త హీరోల సినిమాల కంటే దారుణంగాఈ మూవీ రిజల్ట్ ఉండటం గమనార్హం.

24
థియేటర్లోకి వచ్చిన నాగశౌర్య లేటెస్ట్ మూవీ

నాగశౌర్య ఈ శుక్రవారం `బ్యాడ్‌ బాయ్‌ కార్తీక్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. రామ్‌ దేశినా దర్శకత్వం వహించగా, ఇందులో శ్రీదేవి విజయ్‌ కుమార్‌ కీలక పాత్ర పోషించారు. విధి యాదవ్‌ హీరోయిన్‌గా చేసింది. సముద్రఖని, మైమ్‌ గోపి, నరేష్‌, వెన్నెల కిశోర్‌, పూర్ణ వంటి వారు నటించారు.  శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది.  డిజాస్టర్‌ టాక్‌ వస్తోంది.

34
బ్యాడ్ బాయ్‌ కార్తీక్‌కి టీ ఖర్చులు కూడా రాలే

ఇక ఈ మూవీ ఈ సినిమాని సుమారు రూ.30కోట్ల బడ్జెట్‌తో నిర్మించారట. కానీ వసూళ్ల పరంగా చూస్తే దీనికి కనీసం యాభై లక్షలు కూడా రాలేదని ట్రేడ్‌ వర్గాల టాక్‌. సినిమా బిజినెస్‌ కాలేదు. ఓటీటీ అమ్ముడు పోలేదు, శాటిలైట్‌ కూడా కాలేదు. దీంతో నిర్మాత సొంతంగా రిలీజ్‌ చేశాడు. అంటే ప్రమోషన్స్ తోపాటు థియేటర్ల రెంట్‌ కట్టి సినిమాని రిలీజ్‌ చేశారు. కానీ థియేటర్‌ రెంట్‌ డబ్బులు కూడా రాలేదట. ఒక్కో థియేటర్లో ఐదు వేల లోపే వచ్చాయని, రెంట్‌లో సగం డబ్బులు కూడా రాలేదని టాక్‌. ఇంకా చెప్పాలంటే నిర్మాతకి థియేటర్‌ నుంచి టీ డబ్బులు కూడా రాలేదని చెప్పొచ్చు. ఇదే ఆశ్చర్యపరుస్తోంది.

44
సరైన కథలను ఎంచుకోవడంలో విఫలమైన నాగశైర్య

ఒకప్పుడు మంచి హీరోగా, కుర్ర హీరోగా ఎదిగిన నాగశౌర్య సినిమాకి ఇలాంటి పరిస్థితి రావడం ఆశ్చర్యపరుస్తోంది. నాగశౌర్య నిజానికి చాలా సౌమ్యుడు. అందరితోనూ బాగుంటాడు. ఎలాంటి గొడవలు, వివాదాలు లేవు. ఫ్యామిలీ హీరో టైప్‌. కానీ ఆయన సినిమా ఇలాంటి దారుణమైన రిజల్ట్ ని చవిచూడటం విచారకరం. సరైన కథలను ఎంచుకోవడంలో విఫలం కావడంతో ఆయా చిత్రాలు ఆడియెన్స్ ని ఆకట్టుకోలేకపోతున్నాయి. దీంతో పరాజయం తప్పడం లేదు. ఇప్పుడు నటించిన `బ్యాడ్‌ బాయ్‌ కార్తీక్‌` కూడా రొటీన స్టోరీనే. ఇది అక్క, తమ్ముడు మధ్య సాగే కథ. ఇకపై అయినా ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉండే కథలను ఎంచుకుని నాగశౌర్య మళ్లీ కమ్‌ బ్యాక్‌ కావాలని కోరుకుందాం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories