సూపర్ స్టార్స్ అయిన తండ్రి, తమ్ముడిని మించేలా వేలకోట్లకి వారసురాలైన అక్క.. ఆమె గురించి ఈ విషయాలు తెలుసా

Published : Jul 18, 2025, 01:32 PM IST

తమ్ముడు సూపర్ స్టార్ అయినప్పటికీ అతడి మించేలా వేలకోట్ల ఆస్తులు పొందిన ఆ సెలెబ్రిటీ సిస్టర్ ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
టాలీవుడ్ సెలెబ్రిటీ సిస్టర్స్ 

టాలీవుడ్ లో చాలా మంది హీరోలకు అక్క చెల్లెల్లు ఉన్నారు. హీరోల అక్క చెల్లెళ్లలో కొందరి గురించి మాత్రమే అభిమానులకు, ప్రేక్షకులకు తెలుసు. చాలా మంది హీరోల సిస్టర్స్ తెరవెనుకే ఉండిపోయారు. చిరంజీవి, బాలయ్య, నాగార్జున, రాంచరణ్, మహేష్, మంచు విష్ణు, నితిన్ లకు సిస్టర్స్ ఉన్నారు. మహేష్ బాబుకి ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. 

25
మహేష్ బాబు అక్క చెల్లెళ్ళు 

టాలీవుడ్ హీరోల సిస్టర్స్ అందరిలో మహేష్ బాబు సోదరి ఒకరు చాలా రిచ్. ఆమె గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సూపర్ స్టార్ కృష్ణకి పద్మావతి ఘట్టమనేని, మంజుల ఘట్టమనేని, ప్రియదర్శిని ఘట్టమనేని ముగ్గురు కుమార్తెలు సంతానం. వీరిలో పద్మావతి, మంజుల మహేష్ కంటే పెద్దవారు. ఇక ప్రియదర్శిని మహేష్ కంటే చిన్నవారు. ఆమె హీరో సుధీర్ సతీమణి అనే సంగతి తెలిసిందే. మంజుల భర్త సంజయ్ స్వరూప్ కూడా టాలీవుడ్ లో నటుడిగా రాణిస్తున్నారు. 

35
సెలెబ్రిటీ సిస్టర్స్ లో రిచెస్ట్ గా మహేష్ సోదరి 

ఇక మహేష్ బాబు పెద్ద అక్క పద్మావతి ఘట్టమనేని టాలీవుడ్ హీరోల సిస్టర్స్ అందరిలో రిచెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే వాళ్ళది అపర కుబేరుల ఫ్యామిలీ. ఆస్తుల విషయంలో ఆమె దరిదాపుల్లోకి కూడా ఎవరూ రాలేరు. ప్రస్తుతం ఆమె వయసు 56 ఏళ్ళు. పద్మావతి భర్త గల్లా జయదేవ్ గతంలో గుంటూరు ఎంపీగా రాజకీయాల్లో రాణించారు. వీళ్ళకి వ్యాపార రంగంలో పెద్ద సామ్రాజ్యమే ఉంది.

45
వేల కోట్ల ఆస్తులు 

గల్లా జయదేవ్ కి చెందిన అమర్ రాజా గ్రూప్ కంపెనీ గురించి అందరికీ తెలిసిందే. ఈ సంస్థ ద్వారా అమరాన్ బ్యాటరీస్ తయారవుతాయి. ఈ సంస్థ టర్నోవర్ 18వేల కోట్ల వరకు ఉంటుందని సమాచారం. గల్లా జయదేవ్ గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఇండియాలో రిచెస్ట్ ఎంపీలలో ఆయన నాలుగో స్థానంలో నిలిచారు. అప్పట్లో గల్లా జయదేవ్ తన ఆస్తుల విలువ 680 కోట్లు అని ప్రకటించారు. అమర్ రాజా గ్రూప్ సంస్థకి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ తరుపున రెండు సార్లు లోక్ సభకి ఎన్నికయ్యారు. 

55
తండ్రి, తమ్ముడు ఇద్దరూ సూపర్ స్టార్లు కానీ.. 

ఆ విధంగా మహేష్ బాబు సోదరి పద్మావతి ఘట్టమనేని వేల కోట్లకి వారసురాలు అయ్యారు. పద్మావతి, గల్లా జయదేవ్ వివాహం 1991లో జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు గల్లా అశోక్, గల్లా సిద్ధార్థ్ సంతానం ఉన్నారు. గల్లా అశోక్ ఇప్పటికే టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తన తండ్రి కృష్ణ, సోదురుడు మహేష్ బాబు ఇద్దరూ సూపర్ స్టార్లు అయినప్పటికీ వాళ్ళని మించేలా పద్మావతికి ఆస్తులు ఉన్నాయి. 

Read more Photos on
click me!

Recommended Stories