Prabhas: ప్రభాస్‌ ఏఐ ఫోటో వైరల్‌.. వాళ్లు చేసిన పనేనా? అసలు నిజం ఏంటంటే?

Published : Jul 18, 2025, 12:38 PM ISTUpdated : Jul 18, 2025, 02:37 PM IST

ప్రభాస్‌ ప్రస్తుతం పాన్‌ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. త్వరలో ఆయన `రాజా సాబ్‌`తో ఆడియెన్స్ ముందుకు రానున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు డార్లింగ్‌ ఏఐ ఫోటో ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తోంది. 

PREV
15
ప్రభాస్‌ ఇండియా బిగ్గెస్ట్ స్టార్‌

ప్రభాస్‌ ప్రస్తుతం ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన మన తెలుగు నటుడు కావడం మనకు దక్కిన గౌరవం. పాన్‌ ఇండియా సినిమా లెక్కలు మార్చేసిన నటుడు ప్రభాస్‌ ప్రస్తుతం పాన్‌ ఇండియా, గ్లోబల్ రేంజ్‌ మూవీస్‌ చేస్తూ బిజీగా ఉన్నారు. డార్లింగ్‌ పేరుతో ఇప్పుడు నాలుగైదు వేల కోట్ల వ్యాపారం జరుగుతుండటం విశేషం.

25
ప్రభాస్‌ ఏఐ ఫోటో హల్‌చల్‌

ప్రభాస్‌ ఇటీవల ప్రసాద్‌ ఐమాక్స్ లో సందడి చేశారు. ఆడియెన్స్ మధ్య `ఎఫ్‌ 1` సినిమా చూసి ఆశ్చర్యపరిచారు. చాలా రోజుల తర్వాత ఆయన ఇలా పబ్లిక్‌ లో మెరవడం విశేషం. అలా ప్రభాస్ ని చూసి అభిమానులు ఖుషి అయ్యారు.

ఈ క్రమంలో ఇప్పుడు ప్రభాస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారారు. ఆయన ఏఐ ఫోటో నెట్టింట రచ్చ చేస్తుంది. ఇందులో విగ్‌ లేకుండా కనిపిస్తున్నారు.

35
ప్రభాస్‌ ఏఐ ఫోటోని ఖండించిన పీఆర్‌ టీమ్‌

దీంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. డార్లింగ్‌ ఇలా కనిపించడమేంటనేది ఆందోళన చెందుతున్నారు. అయితే ఆరా తీయగా ఇది నిజం కాదని, ఫేక్‌ అని తేలింది. ప్రభాస్‌ పీఆర్‌ టీమ్‌ కూడా దీన్ని ఖండించింది. 

ఇది ప్రభాస్‌ ఫోటో కాదని, కావాలని కొందరు చేసిన అసత్య ప్రచారం అని తేల్చి చెప్పింది. ప్రభాస్‌ ఆంటీ ఫ్యాన్స్ చేస్తున్న కుట్రగా వెల్లడించారు. ఇలాంటివి నమ్మవద్దని, అసత్య ప్రచారాలు చేయోద్దని తెలిపారు. 

45
`ది రాజాసాబ్‌`తో రాబోతున్న ప్రభాస్‌

 ప్రభాస్‌ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో `ది రాజాసాబ్‌` చిత్రంలో నటిస్తున్నారు.  ఈ మూవీ షూటింగ్‌ ఆర్‌ఎఫ్‌సీలో జరుగుతుంది. ఇది ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కానుంది.  ప్రభాస్‌ మొదటిసారి హర్రర్‌ సినిమా చేస్తున్నారు. రొమాంటిక్‌ హర్రర్ ఫాంటసీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు మారుతి.

మారుతి  మార్క్ వినోదం ఇందులో పుష్కలంగా ఉండబోతుందని ఇటీవల విడుదలై టీజర్‌ చూస్తే అర్థమవుతుంది. ఇందులో డార్లింగ్‌ సరసన నిధి అగర్వాల్‌, మాళవిక మోహనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్‌ దత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.  పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. 

55
ప్రభాస్‌ చేయబోయే సినిమాలివే

అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో `ఫౌజీ` మూవీ చేస్తున్నారు. ఇది వచ్చే ఏడాది విడుదల కానుంది. త్వరలోనే సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో `స్పిరిట్‌` మూవీని స్టార్ట్ చేయనున్నారు. ఇందులో హీరోయిన్ గా డిమ్రీ త్రిప్తి ఎంపికైన విషయం తెలిసిందే. 

 వీటితోపాటు  ప్రశాంత్‌ వర్మతో ఓ సినిమా, అలాగే ప్రశాంత్‌ నీల్‌తో `సలార్‌ 2`, నాగ్‌ అశ్విన్‌తో `కల్కి 2` సినిమాలు చేయాల్సింది ప్రభాస్‌. ఇవి స్టార్ట్ కావడానికి మరో ఏడాదికిపైగానే పట్టే అవకాశం ఉంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories