అనుష్క పెళ్లి చేసుకుంటే అలా అవుతుందా.. రష్మిక పరిస్థితి కూడా అంతే, వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు

Published : May 12, 2022, 07:03 AM IST

టాలీవుడ్ లో జాతకాల గురించి తరచుగా చర్చ జరుగుతూ ఉంటుంది. ఏ సెలెబ్రటీ జాతకం ఎలా ఉంది అంటూ కొందరు జ్యోతిష్యులు అంచనా వేస్తుంటారు.

PREV
16
అనుష్క పెళ్లి చేసుకుంటే అలా అవుతుందా.. రష్మిక పరిస్థితి కూడా అంతే, వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ లో జాతకాల గురించి తరచుగా చర్చ జరుగుతూ ఉంటుంది. ఏ సెలెబ్రటీ జాతకం ఎలా ఉంది అంటూ కొందరు జ్యోతిష్యులు అంచనా వేస్తుంటారు. సంచలన వ్యాఖ్యలతో, వివాదాలతో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి నిత్యం వార్తల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం. 

26

నాగ చైతన్య, సమంత విడిపోతారని కూడా వేణు స్వామి గతంలో తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్ కు కొన్ని సంవత్సరాల పాటు ఇబ్బందులు తప్పవని కూడా వేణు స్వామి తెలిపారు. తాజాగా వేణు స్వామి స్వీటీ అనుష్క శెట్టి, రష్మిక వివాహాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో నయనతార, విగ్నేష్ శివన్ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తుండడంతో ఈ జాతకాల గొడవ మళ్ళీ మొదలైంది. 

36

వేణు స్వామి అనుష్క వివాహం గురించి చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా ఉన్నాయి. హీరోయిన్ గా గ్లామర్ పాత్రలతో, లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో సౌత్ లో ఓ వెలుగు వెలిగిన అనుష్క ప్రస్తుతం సినిమాల సంఖ్య తగ్గించింది. బాహుబలి చిత్రంతో అనుష్క జాతీయ వ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకుంది. అనుష్క ఇటీవల సినిమా సంఖ్య తగ్గించడంతో ఆమె పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి. 

46

వేణు స్వామి.. అనుష్క పెళ్లి గురించి మాట్లాడుతూ.. అనుష్క జాతకంలో గురువు నీచ స్థితిలో ఉన్నారు. కాబట్టి అనుష్కకి వివాహం కలిసిరాదు. పెళ్ళికి సంబందించిన అంశం ఆమె జాతకంలో సరిగ్గా లేదు అని వేణు స్వామి అన్నారు. అనుష్క వివాహం చేసుకుంటే ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. 

56

అలాగే నేషనల్ క్రష్ రష్మిక జాతకం కూడా దాదాపుగా అలాగే ఉందని వేణు స్వామి తెలిపారు. ఆమెకు కూడా వివాహం కలసిరాదు అంటూ వేణు స్వామి చెప్పుకొచ్చారు. అలాగే వీళ్ళ సినీ కెరీర్ కూడా త్వరలోనే అంతం అవుతుందని వేణు స్వామి అన్నారు. గతంలో రష్మిక తన కెరీర్ కోసం వేణు స్వామి దగ్గర హోమం కూడా చేయించుకుంది. 

66

త్వరలో పెళ్లి చేసుకోబోతున్న నయనతార, విగ్నేష్ శివన్ లు వివాహం తర్వాత విడిపోతారు అంటూ వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కొన్నిరోజుల తర్వాత వారి వైవాహిక జీవితంలో కలతలు మొదలవుతాయని వేణు స్వామి అంటున్నారు. 

click me!

Recommended Stories