Published : May 12, 2022, 08:14 AM ISTUpdated : May 12, 2022, 08:40 AM IST
సూపర్ స్టార్ బాబు నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట థియేటర్స్ లో సందడి షురూ చేసింది. తెల్లవారు జాము నుంచే యుఎస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి.
సూపర్ స్టార్ బాబు నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట థియేటర్స్ లో సందడి షురూ చేసింది. తెల్లవారు జాము నుంచే యుఎస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. దీనితో థియేటర్స్ వద్ద మహేష్ అభిమానుల కోలాహలం కనిపిస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.
26
Sarkaru Vaari Paata Review
ప్రస్తుతం ఓటిటి బాగా పుంజుకుంది. ముఖ్యంగా కోవిడ్ మొదలైనప్పటి నుంచి ఓటిటిలో సినిమాల తాకిడి బాగా ఎక్కువైంది. ఎంత భారీ చిత్రం అయినా రెండు నెలల్లోపే ఓటిటి లోకి వచ్చేస్తోంది. ఇక సర్కారు వారి పాట చిత్రానికి కూడా అదిరిపోయే ఓటిటి డీల్ కుదిరినట్లు తెలుస్తోంది.
36
Sarkaru Vaari Paata Twitter Talk
దిగ్గజ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ సర్కారు వారి పాట డిజిటల్ రైట్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ 35 నుంచి 45 కోట్లకు సర్కారు వారి పాట డిజిటల్ రైట్స్ ని అమెజాన్ సొంతం చేసుకున్నట్లు టాక్. అయితే డిజిటల్ రైట్స్ ని అమెజాన్ సొంతం చేసుకుందా అనేది అధికారికంగా క్లారిటీ లేదు. ఇది కళ్ళు చెదిరే ఆఫర్ అనే చెప్పాలి. మహేష్ సినిమాకి రిపీట్ వాల్యూ ఉంటుంది. సో డిజిటల్ రైట్స్ ఆ మాత్రం పలకడం సహజమే. జూన్ చివర్లో ఈ చిత్రం ఓటిటి లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు టాక్. ఒక వేళ సినిమా రిజల్ట్ కనుక తేడా వస్తే ఇంకా ముందే వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.
46
Sarkaru Vaari Paata Twitter Talk
ఇక ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ వరల్డ్ వైడ్ గా 122 కోట్లు జరిగింది. డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ అన్ని కలుపుకుంటే ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ 200 కోట్లు దాటినట్లు సమాచారం. సో నిర్మాతలు ఆల్రెడీ భారీ ప్రాఫిట్స్ బుట్టలో వేసుకున్నట్లే. థియేట్రికల్ రన్ లో సినిమా టాక్ ని బట్టి బయ్యర్లకు లాభాలు ఉంటాయి.
56
అయితే ఈ చిత్రం ఎప్పుడు ఒటిటిలోకి వస్తుంది అనేది ఇంకా ఖరారు కాలేదు. థియేట్రికల్ రన్ చివరి దశకు చేరుకున్న సమయంలో ఓటిటి రిలీజ్ డేట్ ప్రకటిస్తారు. ఇదిలా ఉండగా సర్కారు వారి పాట థియేట్రికల్ రన్ లో తొలి రోజు ట్రేడ్ పండితులు భారీ నంబర్స్ నమోదవుతాయని అంచనా వేస్తున్నారు.
66
ఈ చిత్రంలో విలన్ పాత్రలో సముద్ర ఖని నటించారు. తమన్ అందించిన పాటలు ఆల్రెడీ సూపర్ హిట్ అయ్యాయి. మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఫుల్ పాజిటివ్ వైబ్స్ తో ఈ చిత్రం రిలీజ్ అవుతుండడంతో బ్లాక్ బస్టర్ పక్కా అనే కాన్ఫిడెన్స్ లో మహేష్ అభిమానులు ఉన్నారు.