Maheshbabu Reality: మహేష్‌ బాబు రియాలిటీ బయటపెట్టిన స్టార్‌ ప్రొడ్యూసర్‌.. ఆయనతో వ్యవహారం అలా ఇలా ఉండదట

Published : Jun 03, 2026, 06:35 PM IST

మహేష్‌ బాబు ఎక్కువగా సెటైరికల్‌గా కనిపిస్తారు. పంచ్‌లతో ఆకట్టుకుంటారు. మరి రియల్‌ లైఫ్‌లో ఎలా ఉంటారో తెలిపారు నిర్మాత ఎంఎస్‌ రాజు. ఆశ్చర్యకరమైన విషయాన్ని పంచుకున్నారు. 

PREV
14
వారణాసితో అంతర్జాతీయ మార్కెట్‌పై కన్ను

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు.. సూపర్‌ స్టార్‌ కృష్ణ వారసత్వాన్ని పునికి పుచ్చుకుని సినిమాల్లోకి వచ్చాడు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. భవిష్యత్‌లో తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న `వారణాసి` మూవీతో ఆయన అంతర్జాతీయ మార్కెట్‌పై కన్నేసిన విషయం తెలిసిందే.

24
సెటర్లకి కేరాఫ్‌ మహేష్‌

ఇదిలా ఉంటే మహేష్‌ బాబు సెటైర్లకి కేరాఫ్‌. ప్రెస్‌ మీట్లలో జర్నలిస్ట్ ల ప్రశ్నలకు ఆయన వేసే కౌంటర్లు క్రేజీగా ఉంటాయి. తోటి ఆర్టిస్ట్ లపై కూడా ఆయన అదే స్థాయిలో సెటైర్లు వేస్తూ నవ్విస్తుంటారు. సూపర్‌ స్టార్‌లోనూ కొంత ఎటకారం ఉంటుంది, అదే మహేష్‌ కి కూడా వచ్చింది. అయితే మహేష్‌ ఇన్‌ సైడ్‌ ఎలా ఉంటారనేది తాజాగా స్టార్‌ ప్రొడ్యూసర్‌ వెల్లడించారు. దర్శక, నిర్మాత ఎంఎస్‌ రాజు.. మహేష్‌ బాబుతో `ఒక్కడు` మూవీని నిర్మించారు.

34
మహేష్‌ రియాలిటీ ఇదే

తాజాగా ఆయన మహేష్‌ గురించి మాట్లాడుతూ, మహేష్‌ తో డిస్కషన్‌ మామూలుగా ఉండదని, వచ్చారా, టిఫిన్‌ చేశారా? వాటర్‌ తీసుకుంటారా? అనేలా ఉండదు. పనికిరాని సోది ఆయనతో ఉండదని, ఏదైనా స్ట్రెయిట్‌గా చెప్పేస్తారని తెలిపారు. తాను కలిసినప్పుడు మనం కలిసి సినిమా చేద్దామా అని ఓపెన్‌గా చెప్పేశాడని వెల్లడించాడు. `ఒక్కడు` సినిమా సమయంలో జరిగింది ఇదే అని తెలిపారు.

44
ఒక్కడు వెనుక స్టోరీ

మహేష్‌ సినిమా చేయడానికి ఓకే చెప్పినప్పుడు ఎవరితో చేయాలనే ఆలోచనలో పడ్డానని, ఆ సమయంలో గుణశేఖర్‌ అయితే పర్‌ఫెక్ట్ గా సెట్‌ అవుతారని అనిపించిందని, ఆయనతో కథా చర్చలకు కూర్చొని కొన్ని మార్పులు చేసి, ఆ తర్వాత మహేష్‌కి వినిపించామని, ఆయన ఓకే చేశారని తెలిపారు. అయితే సినిమా ప్రారంభంలోనే కొండారెడ్డి బురుజు వద్ద ఫైట్‌ సీన్‌ ఉంటుందని, అది పెడితే వర్కౌట్‌ కాదని తానే చెప్పానని, పరుచూరి బ్రదర్స్ వంటి కొందరికి సినిమా చూపించిన తర్వాత మార్పులు చేశామని, సినిమా పెద్ద హిట్‌ అయ్యిందని తెలిపారు. ఇది మహేష్‌కి తమకి మైల్‌ స్టోన్‌ మూవీగా నిలిచిందన్నారు. ప్రస్తుతం ఎంఎస్‌ రాజు `అగాధ` అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం త్వరలోనే విడుదలకు రెడీ అవుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories