Varanasi Remunerations : టాలీవుడ్ లోనే కాదు.. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది వారణాసి మూవీ. దాదాపుగా 1500 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోన్న ఈమూవీ కోసం మహేష్, రాజమౌళి, ప్రియాంక చోప్రా ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో తెలుసా?
సూపర్ స్టార్ మహేష్ బాబు , దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమా వారణాసి. ఈ సినిమా రిలీజ్ కు ఇంకా ఏడాదిన్నర పైనే సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే మూవీ భారీ అంచనాలను పెంచుకుంటూ వస్తోంది. రీసెంట్ గా రామోజీ ఫిలిం సిటీలో జరిగిన వారణాసి టైటిల్ టీజర్ ఈవెంట్ ప్లాప్ అయినా.. మహేష్ బాబు లుక్ పై మాత్రం అభిమానులు దిల్ ఖుష్ గా ఉన్నారు. వారణాసి టీజర్ వీడియో, టైటిల్ పై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు, మీమ్స్, ఎడిట్స్ వైరల్ అవుతున్నాయి. ఈక్రమంలో ఈ ఈవెంట్ పలు వివాదాలు కూడా క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే?
25
వారణాసి బడ్జెట్, రెమ్యునరేషన్స్
వారణాసి సినిమా బడ్జెట్ పై రకరకాల వెర్షన్స్ వినిపిస్తున్నాయి. ఈసినిమా 1200 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసినిమా పూర్తయ్యే వరకూ.. ఈఖర్చు 1200 నుంచి 1500 కోట్లు అయ్యే అవకాశం ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. అయితే ఇంత వరకూ వారణాసి బడ్జెట్ పై అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. ఇక ఈసినిమాలో పెద్ద పెద్ద స్టార్స్ నటిస్తుండటంతో వారి రెమ్యునరేషన్స్ పై కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా వారణాసి కోసం మహేష్ బాబు ఎంత తీసుకుంటున్నాడు.. రాజమౌళి భాగం ఎంత..ప్రియాంక, పృథ్విరాజ్ లు ఎంత వసూలు చేస్తున్నారన్న విషయం ఇంట్రెస్టింగా మారిపోయింది.
35
మహేష్ బాబు , రాజమౌళి రెమ్యునరేషన్స్
ఈసినిమాలో రుద్రగా అద్భుతం చేయబోతున్నాడు మహేష్ బాబు.. జక్కన్న సినిమాలో హీరో అంటే ఎంత టార్చర్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు రెండుమూడేళ్లు.. వారణాసి సినిమా కోసం టైమ్ కేటాయించాడు మహేష్. అందుకోసం ఆయన 100 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక ఈసినిమా నిర్మాణంలో రాజమౌళి కొడుకు కూడా భాగస్వామిగా ఉండటంతో.. జక్కన్న ఈసినిమాలో రెమ్యునరేషన్ కు బదులుగా షేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ రకంగా రాజమౌళి రెమ్యునరేషన్ కింద వందల కోట్లు చేరే అవకాశం కనిపిస్తోంది.
ఇక ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ల రెమ్యునరేషన 10 నుంచి 15 కోట్ల వరకే ఉంది. మహా అయితే 20 కోట్లకు మించి ఇవ్వరు. దీపికా పదుకొనే, నయతార లాంటి హీరోయిన్లు 15 కోట్ల వరకూ వసూలు చేస్తున్నారు. ఇక వారణాసి సినిమా కోసం ఫస్ట్ టైమ్ గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా 30 కోట్లు వసూలు చేస్తున్నట్టు సమాచారం. మహేష్ బాబు పాత్రకు సమానంగా స్క్రీన్ స్పేస్, యాక్షన్ సీక్వెన్సుల్లో పాల్గొనడం వంటి అంశాల వల్ల.. ప్రియాంకకు ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు టాక్. ఇక ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్‌కు 20 కోట్ల రూపాయల పారితోషికం ఇస్తున్నారని వార్తలు బయటకు వచ్చాయి. వారణాసిలో ఆయన క్యారెక్టర్ నిడివి తక్కువగా ఉండటం వల్లే తక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది.
55
మహేష్ బాబు తండ్రిగా స్టార్ హీరో
ఇక వారణాసి సినిమాలో మరో ముఖ్య పాత్రలో తమిళ సినియర్ హీరో మాధవన్ కనిపించనున్నారని సమాచారం. ఆయన మహేష్ బాబు తండ్రి పాత్రలో కనిపిస్తారని అంటున్నారు. ఈ క్యారెక్టర్ కోసం రాజమౌళి ముందుగా టాలీవుడ్ నాగార్జునను అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల కుదరక.. మాధవన్ ను తీసుకున్నట్టు టాక్. ఇక ఈసినిమా బిజినెస్ లో రాజమౌళితో పాటు కీరవాణి, విజయేంద్ర ప్రసాద్, కాంచి, కార్తికేయ, రమా, వల్లి తదితరులకు కూడా వాటాలు ఉన్నట్టు తెలుస్తోంది.