కొత్తగా ఐబొమ్మ వన్, టాలీవుడ్ ను వదలని బొమ్మాళీ భూతం.. పోలీసులను కలవరపెడుతోన్న మరో పైరసీ సైట్

Published : Nov 20, 2025, 09:14 AM IST

Ibomma One : టాలీవుడ్ లో ఐ బొమ్మ సృష్టించిన రచ్చ అంతా ఇంతా కాదు.. పోలీసులను కూడా ముప్పుతిప్పలు పెట్టిన పైరసీ సైట్ ఇష్యూ.. ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడంతో క్లోజ్ అయ్యింది అనుకున్నారు అంతా. కానీ కొత్తగా ఐ బొమ్మ వన్ పేరుతో మరో కొత్త సమస్య మొదలయ్యింది.

PREV
16
వదలని బొమ్మాళీ భూతం..

టాలీవుడ్ నుంచి ఎప్పటి నుంచో కలవరపెడుతూ.. కోట్లు నష్టం తీసుకువస్తున్న అతి పెద్ద సమస్య పైరసీ. ఈ సినిమా పైరసీ కేసులో ఐబొమ్మ, బప్పంటీవీ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్‌ చేసిన గంటల వ్యవధిలోనే ఇంటర్నెట్‌లో మరో పైరసీ వెబ్‌సైట్‌ ప్రత్యక్షమైంది. ఐబొమ్మ వన్‌ (Ibomma One) పేరుతో బయటకు వచ్చిన ఈ సైట్‌ ప్రస్తుతం సోషల్ మీడియా, టెలిగ్రామ్‌ గ్రూపుల్లో వేగంగా షేర్‌ అవుతోంది. పాత ‘ఐబొమ్మ’ మాదిరిగానే ఇందులో కూడా కొత్త సినిమాలు కనిపించడం టాలీవుడ్ ను కలవరపెడుతోంది.

26
మూవీరూల్స్ కు కనెక్ట్ అవుతూ..

ఐ బొమ్మ వన్ కు సబంధించి వెబ్‌సైట్‌లో ఏ సినిమాను క్లిక్‌ చేసినా అది నేరుగా మరో సైట్‌కు రీడైరెక్ట్‌ అవుతూ ‘మూవీరూల్స్‌’ (MovieRules) అనే పైరసీ ప్లాట్‌ఫారంతో కనెక్ట్‌ అవుతోంది. ఈ విషయాన్ని తాజాగా పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి ప్రేక్షకులకు కావాల్సిన కొత్త కొత్త సినిమాలను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఇప్పటికే ఐ బొమ్మ వన్ పై విచారణ మొదలు పెట్టారు. అయితే ఈ ఐబొమ్మవన్ ఇప్పుడు కొత్తగా వచ్చిందేమి కాదు.. గతంలో కూడా ఉంది. కానీ ఐబొమ్మ ఉండటంతో.. ఈ సైట్ ను ఎవరు పెద్దగా పట్టించుకోలేదు.

36
ఐ బొమ్మను మించిన ఐబొమ్మ వన్

ఈ ఐ బొమ్మ వన్ గతంలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఐబొమ్మలో లేని కంటెంట్ కూడా ఈ ఐబొమ్మ వన్ లో కనిపించేదని సమాచారం. ఐబొమ్మలో ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాల క్లీన్ ఫీడ్ కనిపించేవి. కానీ ఐబొమ్మ వన్ లో ఆరోజు రిలీజ్ అయిన కొత్త కొత్త సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా ఇందులో ఆడియన్స్ కు అందుబాటులో ఉంటున్నాయని తెలుస్తోంది. అంతే కాదు యాడ్స్ ప్లే అవ్వకుండా, ఎటువంటి బ్రేక్ లేకుండా ఐ బొమ్మ వన్ లో సినిమాలు, సిరీస్ లు చూసే ఆప్షన్ కనిపనిస్తుండటంతో.. ఆడియన్స్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. అయితే ఐబొమ్మ బాగా ఫేమస్ అవ్వడంతో.. ఎక్కువగా ఆ సైట్ లోకే యూజర్స్ వెళ్ళేవారు. అయితే ఈ ఐబొమ్మ వన్ కూడా ఐబొమ్మ ఫ్యామిలీ నుంచే వచ్చినట్టు తెలుస్తోంది.

46
అధికారుల సమాచారం ప్రకారం..

ప్రాథమిక సమాచారం ప్రకారం, ‘ఐబొమ్మ ఎకో సిస్టం’లో భాగంగా దాదాపు 65 మిర్రర్‌ వెబ్‌సైట్లు పనిచేస్తున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ మిర్రర్‌ సైట్ల వల్ల అసలు నిర్వాహకులను గుర్తించడం మరింత క్లిష్టమైందన్నారు. రవిని అరెస్ట్‌ చేసినప్పటికీ, ఈ మిర్రర్‌ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారానే కొత్త సైట్లు క్రియేట్‌ చేసి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ‘ఐబొమ్మ వన్‌’ కూడా ఈ రకం నెట్‌వర్క్‌లో భాగమే అయ్యుండవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది.

56
ఇతర పైరసీ వెబ్ సైట్ల సంగతి ఏంటి?

రవి ఆపరేట్ చేసిన ‘బప్పం టీవీ’లో ఎక్కువగా ఓటీటీపై మాత్రమే విడుదలైన సినిమాలు అప్లోడ్‌ చేస్తుండేవాడు. కానీ ఇతర పైరసీ సైట్లు అయిన ‘మూవీరూల్స్‌’ ‘తమిళ్‌ఎంవీ’ (TamilMV) సినిమాలు థియేటర్లలో విడుదలైన అదే రోజున ఇంటర్నెట్‌లో పెట్టేయడంతో.. ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా పెద్దఎత్తున నష్టం జరుగుతోందని, ఈ వెబ్‌సైట్లపై కూడా చర్యలు తీసుకుని, వాటిని కూడా క్లోజ్ చేసి.. నిర్వాహకులను అరెస్ట్‌ చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.

66
టాలీవుడ్ లో కలవరం..

ఐ బొమ్మ భూతం వదిలింది అనుకుంటే.. ఇప్పుడు ఐ బొమ్మ వన్ అంటూ మరో పైరసీ భూతం రావడంతో టాలీవుడ్‌ మేకర్స్ కలవరపడుతున్నారు. ప్రొడ్యూసర్లు ఈ కొత్త పరిణామంపై ఆందోళన చెందుతున్నారు. పైరసీని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు, సైబర్‌ క్రైమ్‌ విభాగం ‘ఐబొమ్మ వన్‌’ డొమైన్‌, సర్వర్లు, నిర్వాహకులపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టింది. రవిని అరెస్ట్‌ చేసిన వెంటనే ప్రత్యామ్నాయ సైట్‌ రావడం వల్ల ఇది ఒక పెద్ద నెట్‌వర్క్‌ పని అని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇతర పైరసీ సైట్లపై ప్రస్తుతం ప్రత్యకంగా దర్యాప్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories